26 ఏళ్లు.. ఐ లవ్‌ యూ జాన్‌..! | Rohman Shawl Shares Pic of Miss Universe Sushmita Sen Says Love You | Sakshi
Sakshi News home page

26 ఏళ్లు అవుతోంది జాన్‌: రోహమన్

Published Thu, May 21 2020 3:42 PM | Last Updated on Thu, May 21 2020 4:42 PM

Rohman Shawl Shares Pic of Miss Universe Sushmita Sen Says Love You - Sakshi

‘‘26 ఏళ్లు అవుతోంది జాన్‌... మమ్మల్ని అందరినీ గర్వపడేలా చేశావు.. ఇంకా చేస్తూనే ఉన్నావు. ఐ లవ్‌ యూ’’అంటూ మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌ పట్ల ఆమె ప్రియుడు రోహమన్‌ షాల్‌ ప్రేమను చాటుకున్నాడు. 1994లో సుస్మితా మిస్‌ యూనివర్స్‌ కిరీటం దక్కించుకుని అందాల పోటీల్లో భారత కీర్తిని ఇనుమడింపజేశారు. భారత్‌ నుంచి ఈ ఘనతను సొంతం చేసుకున్న తొలి సుందరీమణిగా ఆమె చరిత్ర సృష్టించారు. సుస్మిత మిస్‌ యూనివర్స్‌గా ఎన్నికై ఈ ఏడాదితో 26 ఏళ్లు పూర్తయ్యాయి. (‘అరుదైన వ్యాధితో బాధపడ్డాను’)

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రోహమన్‌ సుస్మితపై ప్రశంసలు కురిపించాడు. కాగా సుస్మితా సేన్‌... న్యూఢిల్లీకి చెందిన యువ మోడల్‌ రోహమన్‌ షాల్‌తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రతీ వేడుకలోనూ కలిసి సందడి చేస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు. ఇక రోహమన్‌ సుస్మితతో రిలేషన్‌షిప్‌ వరకే పరిమితం కాలేదు. ఆమె దత్తపుత్రికలు రీనా, అలీషాలకు తండ్రి ప్రేమను పంచుతూ వారిలో ఒకడిగా కలిసిపోయాడు. కాగా సుస్మితా సేన్‌ కంటే దాదాపు రోహమన్‌ పదిహేనేళ్లు చిన్నవాడు.(అందగత్తెల అపురూప చిత్రం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement