రియాద్: ఇస్లాం సంప్రదాయవాదానికి చిరునామాగా నిలిచే సౌదీ అరేబియా నుంచి ఒక ముద్దుగుమ్మ మిస్ యూనివర్స్ పోటీలకు సిద్ధమైంది. సౌదీ నుంచి ఇలా ఒక అమ్మాయి అంతర్జాతీయ అందాల పోటీలకు ప్రాతినిధ్యం వహించడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. త్వరలో మలేసియాలో జరగబోయే విశ్వసుందరి పోటీల్లో తాను సౌదీ తరఫున పాల్గొనబోతున్నట్లు 27 ఏళ్ల మోడల్ రూబీ అల్ఖాతానీ సోమవారం ప్రకటించారు. సౌదీలోని రియాద్ నగరం ఈమె స్వస్థలం. ఇప్పటికే పలు అందాల పోటీల్లో పాల్గొన్నారు. కొద్ది వారాల క్రితం మలేసియాలో జరిగిన మిస్ అండ్ మిసెస్ గ్లోబల్ ఏషియన్‌లోనూ పాలుపంచుకున్నారు.
ప్రపంచ సంస్కృతులపై అవగాహన పెంచుకుంటూనే మా సౌదీ సంప్రదాయాలు, సంస్కృతి, వారసత్వాన్ని విశ్వ వేదికలపై వివరిస్తా’ అని అరబ్ న్యూస్‌తో రూబీ అన్నారు. ఇప్పటికే మిస్ సౌదీ అరేబియా కిరీటాన్ని దక్కించుకున్న ఈమె మిస్ మిడిల్ ఈస్ట్(సౌదీ అరేబియా), మిస్ అరబ్ వరల్డ్ పీస్–2021, మిస్ ఉమెన్(సౌదీ అరేబియా) టైటిళ్లను గెలుపొందారు. ఈమెకు ఇన్‌స్టా గ్రామ్‌లో లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు.
ఈమె మోడల్‌గానే కాదు కంటెట్ క్రియేటర్ గానూ రాణిస్తున్నారు. కఠిన ఆంక్షలతో ఫక్తు సంప్రదాయవాదిగా పేరుమోసిన 38 ఏళ్ల సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ ఇటీవలి కాలంలో సౌదీని సంస్కరణల బాటలో పయనింపజేస్తున్నారు. మహిళల డ్రైవింగ్‌కు, పురుషుల పార్టీలకు వెళ్లేందుకు, పురుష సంరక్షులు లేకున్నా పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అనుమతించారు. పూర్తి మద్యనిõÙధం అమల్లో ఉండే సౌదీలో తొలిసారిగా దౌత్యకార్యాలయాలుండే ప్రాంతంలో మద్యం అమ్మకాలకు అనుమతి మంజూరు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment