
మెల్‌బోర్న్: భారత సంతతికి చెందిన ప్రియా సెరావో మిస్ యూనివర్స్ ఆస్ట్రేలియా–2019 కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఈ పోటీల్లో భాగంగా 26 ఏళ్ల సెరావో మొత్తం 26 మంది యువతులను వెనక్కినెట్టి మిస్ యూనివర్స్ ఆస్ట్రేలియాను దక్కించుకుంది. దీంతో ఆమె ఈ ఏడాదిలో జరగనున్న మిస్ యూనివర్స్ పోటీల్లో ఆస్ట్రేలియా తరఫున ప్రాతినిధ్యం వహించనుంది. ప్రియా సెరావ్ భారత్‌లోనే పుట్టింది. అయితే అనంతరం ఆమె కుటుంబం తొలుత ఒమన్‌లో.. తర్వాత దుబాయ్‌లో కొన్నాళ్లు ఉన్నారు. చివరగా ఆమె కుటుంబం ఆస్ట్రేలియాలో స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. న్యాయవిద్యలో డిగ్రీ పూర్తి చేసిన ఆమె.. ప్రస్తుతం మెల్‌బోర్న్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జాబ్స్, ప్రెసింక్ట్స్, అండ్ రీజియన్స్‌లో పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇంతకుముందెన్నడూ ఇలాంటి పోటీల్లో పాల్గొనలేదని, మోడలింగ్‌లో కూడా పాలుపంచుకోలేదని తెలిపారు. మిస్ యూనివర్స్ కిరీటం తనను ఆశ్చర్యపరిచిందని వెల్లడించారు. ఇక వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు చెందిన బెల్లా కాసింబా, విక్టోరియా మారిజానా రద్మానోవిక్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment