
అది జాతి వివక్ష హత్య కాదు!
సిడ్నీ: ఆస్ట్రేలియాలోని సిడ్నీలోని శనివారం జరిగిన భారతీయ ఐటీ కన్సలెంట్ ప్రభా అరుణ్ కుమార్ హత్య జాతి వివక్షతో జరిగినట్లు లేదని ఆ దేశ పోలీసులు స్పష్టం చేశారు. ఇది జాతి వివక్షతో చేసిన హత్య అనేందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. ఈ అంశంపై దర్యాప్తుకు ప్రత్యేక డిటెక్టివ్ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు భారత కౌన్సిల్ జనరల్ సంజయ్ సుధీర్ తెలిపారు.
కేసును ఛేదించేందుకు పోలీసులు ఇప్పటికే ప్రభు హత్యకు ముందు ఇంటి వద్ద నడుస్తు వెళుతున్న సీసీ ఫుటేజ్ ను విడుదల చేశారు. ప్రభ తన భర్తతో మాట్లాడుతూ వెళుతుండగా ఆమెను కొందరు దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే.