![Four Indians die in mass drowning at Australia Philip Island - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/26/aus-kills.jpg.webp?itok=txBIyHHN)
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలోని ఓ బీచ్‌లో బుధవారం జరిగిన ప్రమాదంలో నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఫిలిప్ దీవిలోని ఎటువంటి కాపలా ఉండని ఈ బీచ్‌లో 20 ఏళ్లలో జరిగిన మొదటి ప్రమాదం ఇదేనని అధికారులు చెప్పారు.
మృతులను జగ్జీత్ సింగ్ ఆనంద్(23), సుహానీ ఆనంద్(20), కీర్తి బేడి(20), రీమా సోంధి(43)గా గుర్తించారు. పంజాబ్‌కు చెందిన రీమా సోంధి రెండు వారాల క్రితం క్లైడ్‌లో ఉంటున్న బంధువుల ఇంటికి వచ్చారు. అందరూ కలిసి సరదాగా గడిపేందుకు ఫిలిప్ దీవికి వచ్చి అనూహ్యంగా ప్రమాదానికి గురయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment