Victoria state
-
ఆస్ట్రేలియా బీచ్‌లో ప్రమాదం.. నలుగురు భారతీయులు మృతి
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలోని ఓ బీచ్‌లో బుధవారం జరిగిన ప్రమాదంలో నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఫిలిప్ దీవిలోని ఎటువంటి కాపలా ఉండని ఈ బీచ్‌లో 20 ఏళ్లలో జరిగిన మొదటి ప్రమాదం ఇదేనని అధికారులు చెప్పారు. మృతులను జగ్జీత్ సింగ్ ఆనంద్(23), సుహానీ ఆనంద్(20), కీర్తి బేడి(20), రీమా సోంధి(43)గా గుర్తించారు. పంజాబ్‌కు చెందిన రీమా సోంధి రెండు వారాల క్రితం క్లైడ్‌లో ఉంటున్న బంధువుల ఇంటికి వచ్చారు. అందరూ కలిసి సరదాగా గడిపేందుకు ఫిలిప్ దీవికి వచ్చి అనూహ్యంగా ప్రమాదానికి గురయ్యారు. -
'అంత బడ్జెట్ మావల్ల కాదు'.. కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించలేం
ఒలింపిక్స్ తర్వాత అత్యంత ప్రాధాన్యమున్న టోర్నీ కామన్వెల్త్ గేమ్స్. కాగా నాలుగేళ్లకోసారి నిర్వహించే కామన్వెల్త్ గేమ్స్‌ను 2026లో ఆస్ట్రేలియాలోని విక్టోరియా స్టేట్(Victoria State) వేదిక కానుంది. కానీ తాజాగా తాము కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించలేమని విక్టోరియా స్టేట్ తేల్చి చెప్పింది. అనుకున్నదాని కంటే బడ్జెట్ ఎక్కువైతుందని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత బడ్జెట్‌తో కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించడం తమకు సాధ్యం కాదని పేర్కొంది. గేమ్స్ నిర్వహణ నుంచి తాము తప్పుకుంటున్నట్లు ఇప్పటికే కామన్వెల్త్ గేమ్స్ అథారిటీకి సమాచారమిచ్చామని.. మా కాంట్రాక్ట్‌ను రద్దు చేసి వేరే వాళ్లకు ఇవ్వడం మంచిదని కోరినట్లు విక్టోరియా స్టేట్ ప్రతినిధులు తెలిపారు. విక్టోరియా స్టేట్ ప్రీమియర్ డానియెల్ ఆండ్రూస్ మెల్బోర్న్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో మాట్లాడారు. ''మొదట కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు బడ్జెట్లో రెండు ఆస్ట్రేలియన్ బిలియన్ డాలర్స్($2Aus Billion Dollars) కేటాయించాం. కానీ ఇప్పుడు చూస్తే అది ఏడు ఆస్ట్రేలియ బిలియన్ డాలర్లు($7Aus Billion Dollars) అయ్యేలా కనిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితిలో మాకు ఇది కష్టంగా అనిపిస్తోంది. అసలే లోటు బడ్జెట్‌తో కొట్టుమిట్టాడుతున్న మాకు కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ భారంగా మారే అవకాశం ఉంది. ఒక ఆసుపత్రి లేదా స్కూల్స్ నిర్వహణకు ఖర్చు చేయాల్సిన దానిని ఇలా కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు వినియోగించలేం.. ఇది మాకు మూడింతల బడ్జెట్'' అని తెలిపారు. విక్టోరియా స్టేట్ ప్రతినిధి డానియెల్ ఆండ్రూస్ ► ఇక 2022లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌కు ఇంగ్లండ్‌లోని బర్మింగ్హమ్ పట్టణం ఆతిథ్యమిచ్చింది. ఈ గేమ్స్‌లో ఆస్ట్రేలియా 179 పతకాలతో టాప్‌లో ఉండగా.. రెండో స్థానంలో ఇంగ్లండ్ 176 పతకాలతో ఉంది. ఇక భారత్ ఈ గేమ్స్‌లో 61 పతకాలు(22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలతో) నాలుగో స్థానంలో నిలిచింది. When the Commonwealth Games needed a host city to step in at the last minute, we were willing to help – but not at any price. And not without a big lasting benefit for regional Victoria. — Dan Andrews (@DanielAndrewsMP) July 17, 2023 చదవండి: Asian Games 2023: ఇదేం క్రికెట్ స్టేడియం.. చైనాపై పెదవి విరుస్తున్న క్రికెట్ ఫ్యాన్స్ -
టెస్ట్‌కు రూ.15వేలు, పాజిటివ్‌కు రూ.79వేలు
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం కరోనా అనుమానితులు బయటకు వచ్చి కరోనా పరీక్షలు చేయించుకుంటే వారికి $300 (ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 15,920) చెల్లించనున్నట్లు విక్టోరియా ప్రభుత్వం ప్రకటించింది. కాగా పాజిటివ్ వచ్చిన వారికి $1,500 (ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 79,586) చెల్లించనున్నారు. ఈ మేరకు ఆ రాష్ట్ర సీఎం డేనియల్ ఆండ్రూస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇందుకు సంబంధించి కొన్ని షరతులను కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం విధించింది. ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ, గతంలో ఎలాంటి అనారోగ్యంలేని ఉద్యోగులకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు. పాజిటివ్ వచ్చిన ఉద్యోగులు ఆర్ధిక సాయం పొందాలనుకుంటే తప్పని సరిగా వారి పే స్లిప్ సమర్పించాల్సి ఉంటుంది. పే స్లిప్‌ను అందించలేని పక్షంలో, వారు చట్టబద్ధమైన పత్రాలను అందించాల్సి ఉంటుంది. కాగా.. చాలా మంది ప్రజలు కరోనా పరీక్షలు చేయించుకున్న తర్వాత కూడా ఇంట్లో ఉండటం లేదు. ఫలితం రాకముందే ఉపాధి కోసం కొందరు, షాపింగ్‌లకు, పార్టీలకు అంటూ మరికొందరు రకరకాల కార్యక్రమాకు హాజరవుతున్నారు. వీటన్నిటికి అడ్డుకట్ట వేయడంతో పాటు, కరోనా బాధితుల్ని సులభంగా గుర్తించడానికి ఈ ఆర్థికసాయం ప్రకటిస్తున్నట్లు సీఎం డేనియల్ ఆండ్రూస్ వెల్లడించారు. (కోవిడ్ వ్యాక్సిన్.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు) -
అక్కడికి వెళ్తున్న వారిలో మనోళ్లే ఎక్కువ
సిడ్నీ: ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రానికి వలస వెళ్తున్న వారిలో భారతీయులే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఈ విషయంలో భారత్ ఇంగ్లాండ్‌ను మొట్టమొదటిసారి వెనక్కినెట్టేసి తొలి స్థానంలోకి వచ్చింది. ఆస్ట్రేలియా జాతీయ గణాంకాలు దీనినే సూచిస్తున్నాయి. ఈ విషయమై 2005లో ఆస్ట్రేలియా వెళ్లిన హరీశ్ బుధీరాజ మాట్లాడుతూ.. విక్టోరియా రాష్ట్రం తాము ఉండటానికి అంగీకరించిందని అక్కడ విభిన్న సంస్కృతులను చూడొచ్చన్నారు. విక్టోరియాకు వలస వెళ్లే దేశాలలో భారత్‌తో పాటు ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఇటలీ, వియత్నాం కూడా ఉన్నాయి. పశ్చిమ ఆస్ట్రేలియా, దక్షిణ ఆస్ట్రేలియా, టాస్మానియ, ఉత్తర భూభాగానికి ఇంగ్లండ్ నుంచి పెద్దసంఖ్యలో వలస వెళతారు. ఆస్ట్రేలియాకు వచ్చేవారిలో అత్యధిక శాతం మంది విద్య, పరిశోధన రంగాలకు ప్రాధాన్యమిస్తారని చె ప్పారు. దాదాపు 12 సంవత్సరాల నుం చి ఇక్కడ ఉంటున్నానని, అయి తే ఏనాడూ ఎక్కడా జాత్యహంకారం కనిపించలేదని పేర్కొన్నారు.