మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం కరోనా అనుమానితులు బయటకు వచ్చి కరోనా పరీక్షలు చేయించుకుంటే వారికి $300 (ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 15,920) చెల్లించనున్నట్లు విక్టోరియా ప్రభుత్వం ప్రకటించింది. కాగా పాజిటివ్ వచ్చిన వారికి $1,500 (ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 79,586) చెల్లించనున్నారు. ఈ మేరకు ఆ రాష్ట్ర సీఎం డేనియల్ ఆండ్రూస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇందుకు సంబంధించి కొన్ని షరతులను కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం విధించింది.
ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ, గతంలో ఎలాంటి అనారోగ్యంలేని ఉద్యోగులకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు. పాజిటివ్ వచ్చిన ఉద్యోగులు ఆర్ధిక సాయం పొందాలనుకుంటే తప్పని సరిగా వారి పే స్లిప్ సమర్పించాల్సి ఉంటుంది. పే స్లిప్‌ను అందించలేని పక్షంలో, వారు చట్టబద్ధమైన పత్రాలను అందించాల్సి ఉంటుంది. కాగా.. చాలా మంది ప్రజలు కరోనా పరీక్షలు చేయించుకున్న తర్వాత కూడా ఇంట్లో ఉండటం లేదు. ఫలితం రాకముందే ఉపాధి కోసం కొందరు, షాపింగ్‌లకు, పార్టీలకు అంటూ మరికొందరు రకరకాల కార్యక్రమాకు హాజరవుతున్నారు. వీటన్నిటికి అడ్డుకట్ట వేయడంతో పాటు, కరోనా బాధితుల్ని సులభంగా గుర్తించడానికి ఈ ఆర్థికసాయం ప్రకటిస్తున్నట్లు సీఎం డేనియల్ ఆండ్రూస్ వెల్లడించారు. (కోవిడ్ వ్యాక్సిన్.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు)
Comments
Please login to add a commentAdd a comment