సిడ్నీ: ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రానికి వలస వెళ్తున్న వారిలో భారతీయులే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఈ విషయంలో భారత్ ఇంగ్లాండ్‌ను మొట్టమొదటిసారి వెనక్కినెట్టేసి తొలి స్థానంలోకి వచ్చింది. ఆస్ట్రేలియా జాతీయ గణాంకాలు దీనినే సూచిస్తున్నాయి.
ఈ విషయమై 2005లో ఆస్ట్రేలియా వెళ్లిన హరీశ్ బుధీరాజ మాట్లాడుతూ.. విక్టోరియా రాష్ట్రం తాము ఉండటానికి అంగీకరించిందని అక్కడ విభిన్న సంస్కృతులను చూడొచ్చన్నారు. విక్టోరియాకు వలస వెళ్లే దేశాలలో భారత్‌తో పాటు ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఇటలీ, వియత్నాం కూడా ఉన్నాయి.
పశ్చిమ ఆస్ట్రేలియా, దక్షిణ ఆస్ట్రేలియా, టాస్మానియ, ఉత్తర భూభాగానికి ఇంగ్లండ్ నుంచి పెద్దసంఖ్యలో వలస వెళతారు. ఆస్ట్రేలియాకు వచ్చేవారిలో అత్యధిక శాతం మంది విద్య, పరిశోధన రంగాలకు ప్రాధాన్యమిస్తారని చె ప్పారు. దాదాపు 12 సంవత్సరాల నుం చి ఇక్కడ ఉంటున్నానని, అయి తే ఏనాడూ ఎక్కడా జాత్యహంకారం కనిపించలేదని పేర్కొన్నారు.
అక్కడికి వెళ్తున్న వారిలో మనోళ్లే ఎక్కువ
Published Thu, Apr 13 2017 1:31 PM | Last Updated on Tue, Sep 5 2017 8:41 AM
Advertisement
Advertisement