Four Indians
-
ఆస్ట్రేలియా బీచ్‌లో ప్రమాదం.. నలుగురు భారతీయులు మృతి
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలోని ఓ బీచ్‌లో బుధవారం జరిగిన ప్రమాదంలో నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఫిలిప్ దీవిలోని ఎటువంటి కాపలా ఉండని ఈ బీచ్‌లో 20 ఏళ్లలో జరిగిన మొదటి ప్రమాదం ఇదేనని అధికారులు చెప్పారు. మృతులను జగ్జీత్ సింగ్ ఆనంద్(23), సుహానీ ఆనంద్(20), కీర్తి బేడి(20), రీమా సోంధి(43)గా గుర్తించారు. పంజాబ్‌కు చెందిన రీమా సోంధి రెండు వారాల క్రితం క్లైడ్‌లో ఉంటున్న బంధువుల ఇంటికి వచ్చారు. అందరూ కలిసి సరదాగా గడిపేందుకు ఫిలిప్ దీవికి వచ్చి అనూహ్యంగా ప్రమాదానికి గురయ్యారు. -
అమెరికాలో భారతీయుల హవా
వాషింగ్టన్: నలుగురు భారతీయ అమెరికన్లు తాజాగా అమెరికాలో కీలక పదవులకు ఎన్నికయ్యారు. వారిలో ఒక ముస్లిం మహిళ, మరో వైట్ హౌజ్ మాజీ సాంకేతిక విధాన సలహాదారు కూడా ఉన్నారు. గజాలా హష్మీ వర్జీనియా స్టేట్ సెనెట్‌కు ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా చరిత్ర సృష్టించారు. అలాగే, ఒబామా హయాంలో శ్వేత సౌధంలో టెక్నాలజీ పాలసీ అడ్వైజర్‌గా విధులు నిర్వహించిన సుహాస్ సుబ్రమణ్యం వర్జీనియా రాష్ట్ర ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. గజాలా హష్మీ తొలిసారి ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రస్తుతం రేనాల్డ్స్ కమ్యూనిటీ కాలేజ్‌లో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ టీచింగ్ అండ్ లెర్నింగ్ విభాగానికి వ్యవస్థాపక డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. భారతీయ అమెరికన్లు ఎక్కువగా ఉండే లావుడన్ కౌంటీ నుంచి వర్జీనియా ప్రతినిధుల సభకు సుహాస్ సుబ్రమణ్యం ఎన్నికయ్యారు. 1979తో బెంగళూరుకు చెందిన వైద్యురాలైన తన తల్లితో కలిసి ఆయన అమెరికా వెళ్లారు. మరోవైపు, కాలిఫోర్నియాలో భారతీయ అమెరికన్ మనోహర్ రాజు శాన్ ఫ్రాన్సిస్కో పబ్లిక్ డిఫెండర్‌గా ఎన్నికయ్యారు. అలాగే, నార్త్ కరొలినాలో చార్లట్ సిటీ కౌన్సిల్‌కు డింపుల్ అజ్మీరా మరోసారి ఎన్నికయ్యారు. -
జిబ్రాల్టర్‌లో విడుదలైన నలుగురు భారతీయులు
లండన్: ఇరాన్‌కు చెందిన ఆయిల్ ట్యాంకర్లో ఉండి అరెస్టయిన కెప్టెన్ సహా నలుగురు భారత సిబ్బందిపై పోలీసుల విచారణ ముగిసి వారు జిబ్రాల్టర్‌లో గురువారం విడుదలయ్యారు. స్పెయిన్‌కు దక్షిణాన, సముద్ర తీరంలో ఉండే బ్రిటిష్ ప్రాంతమే ఈ జిబ్రాల్టర్. పనామా జెండా కలిగిన ఈ ఆయిల్ ట్యాంకర్ జిబ్రాల్టర్ జలాల్లోని ఐరోపా పాయింట్ వద్ద ఉండగా, గత నెల 4వ తేదీన జిబ్రాల్టర్ అధికారులు వారిని అడ్డగించి ట్యాంకర్‌ను తమ అధీనంలోకి తీసుకుని అందులోని 28 మంది సిబ్బందిని అరెస్టు చేశారు. సిబ్బందిలో ఎక్కువ మంది భారతీయులే. సిరియాపై యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఆంక్షలున్నాయి. ఈ ఆయిల్ ట్యాంకర్ ద్వారా సిరియాకు ముడి చమురును తీసుకెళ్తున్నారనే అనుమానంతో జిబ్రాల్టర్ అధికారులు సిబ్బందిని అరెస్టు చేశారు. అయితే అది సిరియాకు వెళ్తున్నది కాదని అప్పటి నుంచి ఇరాన్ ప్రభుత్వం, ట్యాంకర్ సిబ్బంది చెబుతూనే ఉన్నారు. దీంతో తాజాగా నలుగురు భారతీయులపై పోలీసులు విచారణ ముగించి, వారిని జిబ్రాల్టర్‌లో విడుదల చేశారు. -
ఇథియోపియాలో కూలిన విమానం
అడిస్ అబాబా: ఆఫ్రికా దేశం ఇథియోపియా గగనతలంలో ఆదివారం పెను విషాదం చోటు చేసుకుంది. రాజధాని అడిస్ అబాబా నుంచి కెన్యా రాజధాని నైరోబి బయల్దేరిన బోయింగ్ 737–8 మ్యాక్స్ విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న సిబ్బంది, ప్రయాణికులు మొత్తం 157 మంది చనిపోయారు. మృతుల్లో నలుగురు భారతీ యులుసహా చైనీయులు, కెనడా, అమెరికా దేశాల పౌరులున్నట్లు తెలిసింది. ఈ ప్రమాదా నికి కారణమేంటో తెలియరాలేదు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ప్రయాణికులు బతికున్నట్లు సమాచారమేదీ లేదని ఇథియోపియా ప్రధాని కార్యా లయం ప్రకటించింది. విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది అంతా చనిపోయారని, మృతుల్లో 33 దేశాలకు చెందిన వారు ఉన్నారని ఇథియోపియా ప్రభుత్వ రంగ మీడియా సంస్థ ఈబీసీ వెల్లడించింది. బయల్దేరిన ఆరు నిమిషాలకే.. అడిస్ అబాబాలోని బోలె విమానాశ్రయం నుంచి బయల్దేరిన ఇథియోపియా ప్రభుత్వ రంగ సంస్థ ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ విమా నం ఆరు నిమిషాలకే కుప్పకూలింది. దక్షిణ అడిస్ అబాబాకు సుమారు 50 కి.మీ దూరం లోని బిషోఫ్తులో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8.44 గంటలకు ఈ ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో విమానంలో ఉన్న 149 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది మృతిచెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. ప్రమాదాన్ని పసిగట్టిన పైలట్ ఎమర్జెన్సీ కాల్ చేశాడని, వెనక్కి వచ్చేందుకు అనుమతి ఇచ్చామని విమానయాన సంస్థ సీఈవో తెలిపారు. విమానం టేకాఫ్ అయిన తరువాత అస్థిర వేగంతో పైకి ఎగిరిందని ఎయిర్ ట్రాఫిక్ మానిటర్ వెల్లడించారు. ప్రమాదానికి గురైన విమానం బోయింగ్ 737–8 మ్యాక్స్ గత నవంబర్లోనే ఎయిర్‌లైన్స్‌లో చేరినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో 32 మంది కెన్యా, 9 మంది ఇథియోఫియా, 18 మంది కెనడా పౌరులున్నట్లు చెప్పారు. అలాగే, చైనా, అమెరికా, ఇటలీ నుంచి ఎనిమిది మంది చొప్పున, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల నుంచి ఏడుగురు చొప్పున, ఈజిప్టు నుంచి ఆరుగురు, నెదర్లాండ్స్ నుంచి ఐదుగురు, భారత్, స్లోవేకియా నుంచి నలుగురేసి చొప్పున ప్రయాణికులు ఉన్నట్లు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు ఇథియోపియా ప్రధాన మంత్రి కార్యాలయం ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఈ దుర్ఘటనపై విమాన తయారీ సంస్థ బోయింగ్ విచారం వ్యక్తం చేసింది. భారతీయ మృతుల గుర్తింపు.. విమాన ప్రమాదంలో మరణించిన భారతీయుల వివరాలను ఇథియోపియా రాయబార కార్యాలయం వెల్లడించింది. అందులో కేంద్ర పర్యావరణ శాఖకు సలహాదారుగా పనిచేస్తున్న ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం కన్సల్టెంట్ శిఖా గార్గ్ ఉన్నారని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ చెప్పారు. గార్గ్ యూఎన్ఈపీ సమావేశానికి వెళ్తున్నారని చెప్పారు. మిగిలిన ముగ్గురు వైద్య పన్నాగేశ్ భాస్కర్, వైద్య హాసిన్ అన్నాగేశ్, నూకవరపు మనీషా అని వెల్లడించారు. మృతుల కుటుంబాలకు మంత్రులు సుష్మా స్వరాజ్, హర్షవర్థన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
ఆ పవర్ ఫుల్ మహిళల్లో నలుగురు మనోళ్లే
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల్లో మనవాళ్లు నలుగురు నిలిచారు. ప్రపంచంలో 100మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా 2016 ఎడిషన్ ను ఫోర్బ్స్ ప్రకటించింది. ఈ జాబితాలో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా చైర్మన్ అరుంధతీ భట్టాచార్య(25వ ర్యాంకు), ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో, ఎండీ చందా కొచ్చర్(40వ ర్యాంకు), బయోకాన్ చైర్మన్, ఎండీ కిరణ్ మజుందర్ షా(77వ ర్యాంకు), హెచ్ టీ మీడియా లిమిటెడ్ ఎడిటోరియల్ డైరెక్టర్, చైర్ పర్సన్ శోభనా భారతీయ(93వ ర్యాంకు)లు చోటు దక్కించుకున్నారు. ఫోర్బ్స్ ప్రకటించిన ఈ జాబితాలో జర్మన్ చాన్స్ లర్ ఏంజెలా మెర్కెల్ అగ్రస్థానంలో నిలిచారు. వరుసగా ఆరోసారి ఆమె ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. మెర్కెల్ తర్వాత స్థానం అమెరికా అధ్యక్ష అభ్యర్థురాలు హిల్లరీ క్లింటన్ ను వరించింది. అమెరికా ఫెడరల్ రిజర్వు చైర్ జానెట్ ఎల్లెన్ ఈ లిస్ట్ లో మూడో స్థానంలో నిలిచారు. బిలీనియర్లు, బిజినెస్, ఫైనాన్స్, మీడియా, పాలిటిక్స్, ఫిలాంథ్రఫిక్ట్స్, ఎన్ జీవోస్, టెక్నాలజీ వాటికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారినుంచి ప్రపంచంలోనే 100 మంది అత్యంత శక్తివంతుల జాబితాను ఫోర్బ్స్ ప్రకటించింది. ఈ కేటగిరీల్లో సంపద, మీడియా ఉనికి, ప్రతిభపాటవాలు వంటి అంశాలను ఆధారంగా చేసుకుని ఫోర్బ్స్ ఈ జాబితాను రూపొందించింది. -
ఐఎస్ఐఎస్లో చేరాలని వెళ్లి సిరియాలో చిక్కారు!
న్యూఢిల్లీ: ఐఎస్ఐఎస్ ఉగ్రవాద గ్రూప్‌లో చేరేందుకు వెళ్లిన నలుగురు భారతీయ యువకులను సిరియా ప్రభుత్వం తన కస్టడీలోకి తీసుకుంది. వీరి గురించి భారత్‌కు సమాచారం అందించి.. వీరి వివరాలు ధ్రువీకరించాల్సిందిగా కోరింది. ప్రస్తుతం మూడురోజుల భారతదేశ పర్యటనలో ఉన్న సిరియా ఉప ప్రధానమంత్రి వాలిద్ అల్ మౌలెం ఈ విషయాన్ని వెల్లడించారు. నలుగురు భారతీయ యువకులు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద గ్రూప్‌లో చేరేందుకు సిరియాలో అడుగుపెట్టారని, అనుమానాస్పదంగా కనిపించిన వారిని సిరియా భద్రతా దళాలు డమస్కస్‌లో అదుపులోకి తీసుకున్నాయని వివరించారు. అయితే వీరిని ఎప్పుడు అదుపులోకి తీసుకున్నారు. వీరి వివరాలేమిటి అన్న విషయాన్ని తెలియజేయలేదు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద గ్రూప్ వైపు ఇటీవల భారతీయ యువత ఆకర్షితులవుతున్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వారిని నిరోధించేందుకు భారత భద్రతా సంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే గత డిసెంబర్లో ఐఎస్ఐఎస్లో చేరేందుకు వెళ్తున్న ముగ్గురు యువకులను నాగ్‌పూర్ విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సిరియాలో కూడా మరో నలుగురిని అదుపులోకి తీసుకోవడం ఈ విషయంలో భారత్ తీసుకుంటున్న చర్యలను చాటుతున్నాయి. -
అమెరికాలో క్రెడిట్ కార్డుల మోసం కేసులో నలుగురు భారతీయులు
అమెరికాలో చోటుచేసుకున్న అతిపెద్ద క్రెడిట్ కార్డుల మోసం కేసులో నలుగురు భారతీయులతో సహా మొత్తం 10 మందిపై కేసు నమోదైంది. మొత్తం 1245 కోట్ల రూపాయలు నష్టం జరిగినట్టు వారిపై అభియోగాలు నమోదు చేశారు. నిందితులలో వినోద్ దడ్లానీ, విజయ్ వర్మ, అమర్ సింగ్, తర్సీమ్ లాల్ భారతీయులు. మిగిలినవారు న్యూయార్క్, న్యూజెర్సీలకు చెందినవారు. ఈ కేసును మూడు దశల్లో విచారణ చేయనున్నారు. నేరం చేసినట్టు రుజువైతే 30 ఏళ్ల దాకా జైలు శిక్ష పడే అవకాశముంది. 60 కోట్ల రూపాయలు జరిమానా కూడా ఎదుర్కోనున్నారు.