
మిస్ యూనివర్స్ పోటీలపై ఐసిస్ కన్ను
మనీలా: వచ్చే ఏడాది జనవరిలో ఫిలిప్ఫీన్స్‌లో జరగనున్న మిస్ యూనివర్స్ పోటీలే లక్ష్యంగా దాడికి పాల్పండేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఐసిస్ ప్రకటించింది. ఈ మేరకు ‘ఐఎస్ ఫిలిప్ఫీన్స్ సపోర్టర్స్’ అనే బృందానికి ఓ వీడియోను టెలిగ్రామ్ మెసేంజర్ ద్వారా పంపించింది.
వీడియోలో ఆత్మాహుతి దాడి కోసం వాడే బెల్టులు, దుస్తులను ఎలా తయారుచేయాలో వివరించారు. అంతేకాకుండా మిస్ యూనివర్స్‌ను చంపడానికి ఓ బాంబు తయారు చేయాలంటూ జిహాదీలకు సలహాలిస్తున్న వీడియోను పోస్టు చేశారు.