Miss Universe Viral Video: Harnaaz Sandhu Dances with ITBP Families - Sakshi
Sakshi News home page

Viral Video: వైరల్‌గా మిస్‌ యూనివర్స్‌ 2021 డాన్స్‌ వీడియో.. 

Published Sun, Mar 27 2022 1:04 PM | Last Updated on Sun, Mar 27 2022 3:06 PM

Viral Video: Miss Universe Harnaaz Sandhu Dances with ITBP Families - Sakshi

లక్నో: మిస్‌ యూనివర్స్‌‌ 2021 విజేతగా నిలిచిన ఇండియన్‌ మోడల్‌ హర్నాజ్‌ కౌర్‌ సంధు డ్యాన్స్‌ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఇండో టిబేటియన్‌ బార్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ) మహిళా సాధికారత, హెచ్‌డబ్ల్యూడబ్ల్యూఏ రైజింగ్ డేని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హర్నాజ్‌ సంధు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐటీబీపీ జవాన్ల కుటుంబ సభ్యులు, పిల్లలతో కలిసి డ్యాన్స్‌ చేశారు.

మహిళలందరితో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్‌ చేశారు. పంజాబీ సాంగ్స్‌కి హర్నాజ్ తనదైన స్టెప్పులతో అదరగొట్టారు. మొత్తం కారక్రమానికే ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అదే విధంగా అక్కడున్న వారందరితోనూ సరదాగా ఫోటోలు దిగారు. ఈ వీడియోను ఐటీబీపీ తన ట్విటర్‌లో పోస్టు చేసింది. ‘మిస్ యూనివర్స్ 2021 హర్నాజ్ కౌర్ సంధు.. హిమవీర్ కుటుంబాలు, పిల్లలతో కలిసి గ్రూప్ పెర్ఫార్మెన్స్ చేశారు’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
చదవండి: అందరిలో ఒకటే ఉత్కంఠ..ఆమె గోల్‌ వేయాలని ఐతే..

కాగా మిస్ యూనివర్స్ 2021 కీరిటాన్ని భారతీయ యువతి హర్నాజ్ కౌర్ సంధు గెలుచుకున్న విషయం తెలిసిందే. దీంతో 21 ఏళ్ల తర్వాత మిస్ యూనివర్స్ కిరీటం గెలుపొందిన భారతీయురాలిగా సంధు రికార్డు సృషకటించారు. చివరిసారిగా లారా దత్తా 2000లో మిస్ యూనివర్స్‌ టైటిల్‌ను గెలుపొందింది. ఇజ్రాయిల్‌లోని ఇలాట్‌ నగరం జరిగిన 70వ మిస్ యూనివర్స్ పోటీల్లో పరాగ్వే, దక్షిణాఫ్రికా సుందరీమణుల నుంచి హర్నాజ్ తీవ్ర పోటీ ఎదుర్కొని.. చివరకు అందాల కిరీటాన్ని హర్నాజ్ సొంతం చేసుకున్నారు.
చదవండి: జీవితంలో రోజుకు ఒకసారైనా ఇలా చేయండి!!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement