![Meet Shruti Hegde Indias First Miss Universe Petite](/styles/webp/s3/article_images/2024/07/18/miss11.jpg.webp?itok=GqhT4oIN)
అమెరికాలో పొట్టి మహిళల కోసం నిర్వహించే అందాల పోటీల్లో విజయకేతనం ఎగురవేసింది కన్నడ బ్యూటీ. భారతదేశంలోని ఓ చిన్న పట్టణంలో ఉండే ఈ మోడల్ అతిపెద్ద కలను సాకారం చేసుకుంది. ప్రతి అమ్మాయి తాను అందాల రాణిని కావాలని ఆకాంక్షిస్తుంటది. అది సాధ్యం కానీ లక్ష్యమే అయినా పట్టుదలగా దాన్ని సాకారం చేసుకుని మరీ అందర్నీ ఆశ్చర్యపరిచింది ఈ కన్నడ మోడల్. ఆమె పేరు శృతి హెగ్డే. ఎవరీమె..? ఎలా ఈ అంతర్జాతీయ అందాల పోటీల్లో పాల్గొన కలిగిందంటే..
బెంగళూరుకు చెందిన శృతి హెగ్డే అనే వైద్యురాలు మోడల్‌గా మారి అంతర్జాతీయ అందాల పోటీల్లో పాల్గొని సత్తా చాటింది. ఈ అందాల పోటీ అంత సులభమైనది కాదు. ఇది పొట్టి మహిళలకు అవకాశం కల్పించేందుకు 2009లో ప్రారంభించిన అందాల పోటీ. ఈ పోటీల్లో పాల్గొన్న వాళ్లంతా అమేజనోనియన్ ప్రమాణాల ప్రకారం మరుగుజ్జుగా ఉంటారు. ప్రతి ఏడాది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని ఫ్లోరిడాలోని టంపాలో ఈ పోటీలు నిర్వహిస్తారు.
నిజానికి శృతి డాక్టర్‌గా పనిచేస్తూ మరోవైపు మోడల్‌గా ఈ అందాల పోటీల్లో పాల్గొనేందుకు ప్రిపేరయ్యేది. ఆస్పత్రిలో 36 గంటల షిఫ్ట్‌ల తోపాటు విశ్రాంతి తీసుకొని మెడికల్ ఎమర్జెన్సీని కూడా ఎదుర్కోంది. అందాల రాణి కావాలన్నది ప్రతి అమ్మాయి కల..అయితే తాను జస్ట్ ఒక ప్రయత్నం చేద్దాం అనుకున్నా, దీనికి తన అమ్మ అందించిన సపోర్టు కూడా ఎంతో ఉపయోగపడిందని అంటోంది హెగ్డే. తాను 2018 మిస్ ధార్వాడ్ పోటీకి సైన్ అప్ చేసింది. ఈ పోటీలో గెలిచేందుకు సన్నద్ధమవుతున్న క్రమంలో తాను చాలా పాఠాలను నేర్చుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది.
ముందుగా తన వైద్య రంగాన్ని, మోడలింగ్ కెరీర్‌ని బ్యాలెన్స్ చేయడం చాలా సవాలుగా ఉండేది. ఒక్కోసారి విశ్రాంతి తీసుకునేంత తీరిక లేని పనులతో ఉక్కిరిబిక్కిరిగా ఉండేదని చెబుతోంది. ఇంతలో 2019లో తనకు గర్భాశయ కణితులు ఉన్నట్లు నిర్ధారణ అయిందని చెప్పింది. దీంతో ఓ రెండేళ్లు ట్రీట్‌మెంట్‌తోనే గడిచిపోయింది. ఇక కెరీర్ ముగిసిపోయింది. ఈ అందాల పోటీల్లో పాల్గొనలేను అనుకున్న సమయాన్ని ఆమె తల్లి అందించిన మద్దతుతో తిరిగా మళ్లీ అందాల పోటీల్లో పాల్గొనడం మొదలు పెట్టింది.
అలా మిస్ ఆసియా ఇంటర్నేషనల్ ఇండియా 2023 రెండో రన్నరప్‌గా టైటిల్‌ని దక్కించుకుంది. ఎప్పుడైతే ఈ టైటిల్ గెలిచిందో అప్పుడు ఆమె మీద ఆర్థిక ఒత్తిడి తగ్గింది. అంతకమునుపు ఓ పక్క ట్రీట్‌మెంట్ మరోవైపు పోటీల ప్రీపరేషన్‌తో ఆర్థిక భారం ఎక్కువగా ఉండేది. దీంతో పోటీల్లో ప్రదర్శని ఇచ్చేందుకు కేవలం రెండు దుస్తులే ఉండేవి. వాటినే వేర్వురు ప్రదర్శనల్లో ధరించేదాన్ని అని చెబుతోంది. ఇప్పుడు ఆమెకు స్పాన్సర్‌లు లభించడంతో ఈ ఆర్థిక భారం నుంచి కాస్త ఉపశమనం పొందింది. ఆమె కష్టానికి ఫలితమే దక్కి గత నెల జూన్ 10న భారతదేశపు తొలి మిస్ యూనివర్సల్ పెటైట్‌గా కిరీటాన్ని గెలుచుకుంది.
(చదవండి: స్పేస్‌లో భోజనం టేస్ట్ ఎలా ఉంటుందంటే..!)
Comments
Please login to add a commentAdd a comment