గతేడాది 2023లో మిస్ యూఎస్‌ఏ విజేతగా ఎంపికైన నోలియా వోయిగ్ట్ సడెన్‌గా తన స్థానం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. తన కిరీటాన్ని వెనక్కి ఇచ్చేస్తున్నట్లు పేర్కొంది. దీంతో ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు ఆమె అభిమానులు. మానసిక ఆరోగ్యం కారణంగానే తాను ఈ అత్యున్నత స్థానానికి రాజీనామా చేస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొంది. ఆరోగ్యమే మహా సంపద అని అందువల్ల ముందు తన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తానని తెలిపింది.
అలాగే మిస్ యూఎస్‌ఏగా తన జర్నీ చాలా అర్థవంతంగా సాగిందని చెప్పింది. మిస్ యూఎస్‌ఏ టైటిల్‌ని గెలుచుకున్న తొలి మెనిజులా అమెరికన్ మహిళ. తాను మిస్ యూఎస్‌ఏ 2023 టైటిల్‌కు రాజీనామా చేయాలన కఠినమైన నిర్ణయం తీసుకున్నాని వోయిగ్ట్ పేర్కొన్నారు. ఇది నాకు కొత్త అధ్యయనం అని తెలుసని, అందువల్ల స్థిరంగా ఉండేందుకు యత్నిస్తా. మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు మిస్ యూఎస్‌ఏ ఆర్గనైజేషన్ ప్రతినిధి మాట్లాడుతూ..వోయిగ్ట్ తన విధుల నుంచి తప్పుకోవాలని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తాం.
మా టైటిల్ హోల్డర్లకు ముందు ప్రాధన్యత ఇస్తాం. ఈ సమయంలో ఆమెకు తనకు తానుగా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది అని మేము గుర్తించాం. తన భాద్యతలకు వారసునిగా చేయడం కోసం చూస్తున్నారని అర్థమయ్యింది.త్వరలో ఆమె కోరుకున్నట్లుగానే కొత్తమిస్ యూఎస్‌ఏని ప్రకటించడం కూడా జరుగుతుంది. అని అన్నారు. ఇన్‌స్టాగ్రాంలో సంస్థ మోడల్‌కి మద్దతను ఇవ్వడమే గాక ఆమె చేసిన సేవకు ధన్యావాదాలు తెలిపింది.
కాగా, హవాయికి చెందిన సవన్నా గాంకీవిచ్ మొదటి రన్నరప్‌గా నిలిచారు. ఆమె తదుపరి కొత్త యూఎస్‌ఏ కిరీటాన్ని పొందే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాల సమాచారం. ఇక వోయిగ్ట్ మిస్ యూఎస్‌ఏగా డేటింగ్ హింసకు వ్యతిరేకంగా, ఇమ్మిగ్రేషన్ హక్కులు, లాభప్రేక్ష లేని స్మైల్ ట్రైన్‌తో పనిచేయడం వంటి పలు సేవలందించారు. ఈ వేదిక తన కలను సాకారం చేసుకునేలా చేసింది. పైగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులతో కనెక్ట్ అయ్యేలా చేసిందని అందుకు తాను ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటానని సోషల్ మీడియా పోస్ట్‌లో రాసుకొచ్చింది.
(చదవండి: సోమవారాల్లో నలిగిన బట్టలే ధరించండి! సీఎస్‌ఐఆర్ పరిశోధన సంస్థ)
Comments
Please login to add a commentAdd a comment