మీరూ మిస్ యూనివర్స్ కావొచ్చు.. | Who will be Miss universe of the year 2014? | Sakshi
Sakshi News home page

మీరూ మిస్ యూనివర్స్ కావొచ్చు..

Published Wed, Aug 6 2014 12:21 AM | Last Updated on Sat, Sep 2 2017 11:25 AM

మీరూ మిస్ యూనివర్స్ కావొచ్చు..

మీరూ మిస్ యూనివర్స్ కావొచ్చు..

కళ్లు తిప్పుకోనివ్వని నిండైన అందం, మెరుపు లాంటి చురుకుదనం, ఉత్తమ తెలివితేటలు, ప్రపంచాన్ని జయించే ఆత్మస్థైర్యం మీలో ఉందా? ఈ క్వాలిటీస్ ఉన్న కత్తిలాంటి అమ్మాయిలు ఇండియా తరఫున మిస్ యూనివర్స్- 2014 పోటీలో పొల్గొనాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? ఆ అవకాశం మీ ముంగిటకు వచ్చేసింది. మొదటగా మీరు చేయాల్సిందల్లా.. యమహా ఫ్యాసినో మిస్ దివా యూనివర్స్-2014 పోటీలో విజేతగా నిలవడమే. ఈ పోటీలకు త్వరలో ముంబయి వేదిక కానుంది. ఈ పోటీలో పాల్గొనదలిచిన అందాల భామలకు ఈనెల 7వ తేదీన గచ్చిబౌలిలోని హోటల్ హయత్‌లో ఆడిషన్స్ జరుగుతాయి. నగరంతో పాటు దేశంలోని ప్రముఖ పది నగరాల్లో జరిగే ఈ ఆడిషన్స్‌లో అందగత్తెలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
 
 తదుపరి ఆడిషన్స్ కోల్‌కతాలో. ఈ క్రమంలో నగరం నుంచి ఏ సుందరీమణి ఫైనల్‌కు వెళ్తుందోనని తీవ్ర ఆసక్తి కలుగుతోంది. దేశం తరఫున మిస్ యూనివర్స్‌లో పొల్గొనడం ఎందరో అందగత్తెల జీవితాశయం. అటువంటి సదావకాశం నిర్దిష్ట లక్షణాలు ఉంటే ఎవరికైనా దక్కొచ్చు. మరెందుకు లేట్.. మీ ప్రొఫైల్‌ను, ఫొటోలను missindiaorganization@gmail.com కు మెయిల్ చేయండి.
 ఆడిషన్స్‌కు సన్నద్ధమవ్వండి. ఆల్ ద బెస్ట్.
 వివరాలకు: 040 - 23306825, వెబ్‌సైట్: www.missdiva.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement