‘వీలైతే నేను మలాల అవుతా’ | Miss Universe 2023: Thailand Contestant Wins Internet With Her Answer Why | Sakshi
Sakshi News home page

‘వీలైతే నేను మలాల అవుతా’

Published Mon, Nov 20 2023 11:06 AM | Last Updated on Mon, Nov 20 2023 4:13 PM

Miss Universe 2023: Thailand Contestant Wins Internet With Her Answer Why - Sakshi

72వ మిస్‌ యూనివర్స్‌ అందాల పోటీలు సెంట్రల్‌ అమెరికాలోని ఎల్‌ సాల్వడార్‌లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పోటీల్లో నికరాగ్వా సుందరి షెన్నిస్‌ పలాసియోస్‌ ప్రతిష్టాత్మకమైన మిస్‌ యూనివర్స్‌–2023 కిరీటం దక్కించుకోగా ఫస్ట్‌ రన్నరప్‌గా థాయిలాండ్‌ భామ ఆంటోనియా పోర్సిల్డ్‌ నిలిచింది. అయితే ఈ పోటీల్లో ఆఖరి రౌండ్‌ ప్రశ్నలు చాలా ఆసక్తికరంగానూ గమ్మత్తుగా ఉంటాయి. అందుకు తగ్గట్టుగానే అందాల భామలు తమదైన శైలిలో చెప్పి జడ్జిలను మత్రముగ్గుల్ని చేసి కీరిటాన్ని దక్కించుకుంటారు. ఇక్కడ ఈ ముగ్గుర్నీ ఒకే ప్రశ్న అడిగారు. అయితే ఆ ప్రశ్నకు థాయిలాండ్‌ భామ ఆంటోనియా పోర్సిల్డ్‌ చెప్పిన సమాధానం అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసింది.

ఊహించిన రీతిలో ఆమె నుంచి వచ్చిన సమాధానం అక్కడున్న వారిని షాక్‌ గురి చేయడమే గాక సోషల్‌ మీడియాలోనూ వైరల్‌గా మారింది. ఇంతకీ పోర్సిల్డ్‌ ఏం చెప్పిందంటే..మిమ్మల్ని ఒక ఏడాది వేరొక మహిళల ఉండమంటే ఎవర్ని ఎంపిక చేసుకుంటారని జడ్జిలు ప్రశ్నించగా..అందుకు పోర్సిల్డ్‌ తాను మలాలా యూసఫ్‌జాయ్‌ని ఎంచుకుంటానని తేల్చి చెప్పింది. ఆమె ఈ రోజు ఆ స్థాయికి చేరుకోవడానికి ఎన్ని కష్టాలు ఫేస్‌ చేసిందో మనకు తెలుసు.

మహిళల విద్యకోసం పోరాడింది. అందుకోసం ప్రాణాలను పణంగా పెట్టి అత్యంత బలంగా పోరాడింది మలాలా. అందువల్ల నేను ఎంచుకోవాల్సి వస్దే ఆమెను సెలక్ట్‌ చేసుకుంటానని సగర్వంగా చెప్పింది. ఐతే ఇదే ప్రశ్నకు కిరీటం దక్కించుకున్న నికరాగ్వా సుందరి షెన్నిస్‌ పలాసియోస్‌ పోర్సిల్డ్‌ మాదిరిగానే మహిళల హక్కుల కోసం పాటుపడిన మేరీ వోల్‌స్టోన్‌క్రాఫ్ట్‌ను ఎంచుకుంటాను చెప్పగా, మరో విశ్వసుందరి ఆస్ట్రేలియన్‌ మోరయా విల్సన్‌ మాత్రం తన తల్లిని ఎంచుకుంటానని చెప్పింది.

ఆమె వల్ల ఈ రోజు ఇక్కడ వరకు రాగలిగానని, అందువల్ల తన తల్లిని ఎంపిక చేసుకుంటానని చెప్పింది. ఇక్కడ థాయిలాండ్‌ భామ పోర్సిల్డ్‌ పాక్‌కి చెందిన ఐకానిక్‌ మహిళ, నోబెల్‌ శాంతి గ్రహిత మలాలా యూసుఫ్‌ జాయ్‌ని చెప్పడం అందర్నీ షాక్‌కి గురి చేసింది. ఆమె సమాధానం ప్రతి ఒక్కరిని కదిలించింది, ఆలోచింప చేసేలా ఉందంటూ నెటిజన్లు ఆమెపై ప్రశంసల జల్లు కురిపించారు. కాగా సెంట్రల్‌ అమెరికా 1975 తర్వాత మళ్లీ తొలిసారిగా ఈ మిస్‌ యూనివర్స్‌ పోటీలను నిర్వహించింది.      

(చదవండి: ఎవరికీ కనిపించనివి కనిపిస్తున్నాయా?.. వినిపించనివి వినిపిస్తున్నాయా?)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement