మాదాపూర్: కూచిపూడి నృత్యాంశాలతో కళాకారిణి ప్రణయ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. మాదాపూర్‌లోని శిల్పకళావేధికలో అదివారం కూచిపూడి నృత్యరూపకం ప్రదర్శనను నిర్వహించారు. కళాకారిణి ప్రణయ గూడిపాటి చేసిన నృత్యాలు సందర్శకులను అలరించాయి. అన్నమాచార్య కీర్తనలు, దశావతారాలు, తరంగం, థిల్లాన తదితర అంశాలను ప్రదర్శించి ఆకట్టుకుంది. కూచిపూడి నృత్యగురువు పొనూర్ క్రాంతి కిరణ్ సమక్షంలో కార్యక్రమాన్ని నిర్వహించారు.
నటువాంగం క్రాంతికిరణ్, వోకల్ మంతశ్రీనివాస్, మృదంగం నాగేశ్వరరావు, వయోలిన్ అనిల్‌కుమార్, ప్లూట్ ఉమావేంకటేశ్వర్లు , శ్రీధరాచార్యులు సంగీత సహకారాన్ని అందించారు. ప్రదర్శనకు పొట్టి శ్రీరాములు తెలుగుయూనివర్సిటి రిటైర్డ్ ప్రొఫెసర్, ఉత్తమ ఆచార్య అవార్డు గ్రహీత భాగవతుల సేతురామ్, కేంద్ర సంగీత నాటక అకాడమి అవార్డు గ్రహీత కళాక్రిష్ణ తదితరులు హాజరై అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment