లండన్: నదుల్లో నీరు ప్రవహించడం సర్వ సాధారణం. మరి పాలు ప్రవహిస్తే? ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ .. ఓ నదిలో పాలు ప్రవహించాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. చూసిన వారు ఏంటీ వింత అని ఆశ్చర్యపోతున్నారు. ఈ సంఘటన యునైటెడ్ కింగ్‌డమ్‌లోని వేల్స్ నగరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... దులైస్ నదిలో ఎప్పటిలానే నీరు ప్రవహిస్తూ ఉంది. కానీ అకస్మాత్తుగా ఏప్రిల్ 14వ తేదీన పాలు నదిలో ప్రవహించడం మొదలుపెట్టాయి.
కారణం ఏంటంటే.. నదికి సమీపంలో ప్రమాదం జరిగి ఓ భారీ పాల ట్యాంకర్ బోల్తా పడింది. సుమారు 28,000 లీటర్ల పాలు వరదలా పోటెత్తి నదిలోకి ప్రవహించాయి. దీంతో దులైస్ నది క్షీర ప్రవాహాన్ని తలపించింది. నదిలో పాల ప్రవాహాన్ని చూసిన జనాలు ఇదెక్కడి ఆశ్చర్యం అంటు షాక్‌కు తిన్నారు. ఏదో మాయలా ఉందే అని ఆ ప్రాంతంలోని కొందరు స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాద విషయం తెలియడంతో ఊపిరిపీల్చుకున్నారు.
( చదవండి: యాక్టింగ్ ఇరగదీశాడు.. అయినా పోలీసులకు దొరికిపోయాడు.. )
Comments
Please login to add a commentAdd a comment