ఏయూతో యూకే యూనివర్సిటీ ఎంవోయూ | UK University MoU with AU | Sakshi
Sakshi News home page

ఏయూతో యూకే యూనివర్సిటీ ఎంవోయూ

Published Sat, Aug 26 2023 3:14 AM | Last Updated on Sat, Aug 26 2023 3:14 AM

UK University MoU with AU - Sakshi

ఎంవీపీకాలనీ (విశాఖపట్నం): ఆంధ్ర విశ్వవిద్యాలయంతో యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే)కు చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ హైలాండ్స్‌ అండ్‌ ఐస్‌లాండ్స్‌ అవగాహన ఒప్పందం చేసుకుంది. ఏయూ ఈసీ హాల్‌లో శుక్రవారం జరిగిన  కార్యక్రమంలో ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి, సౌత్‌ ఇండియా బ్రిటిష్‌ కౌన్సిల్‌ డైరెక్టర్‌ జనక పుష్పనాథన్‌ సమక్షంలో ఏయూ రిజిస్ట్రార్‌ ఆచార్య వి.కృష్ణమోహన్, యూకే ఇంటర్నేషనల్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ సనమ్‌ అరోరా ఈ ఎంవోయూపై సంతకాలు చేశారు.

ఈ సందర్భంగా వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి మాట్లాడుతూ ఒప్పందంలో భాగంగా ఎంబీఏ, ఎమ్మెస్సీ అప్లయిడ్‌ డేటా ప్రాసెస్‌ కోర్సుల్లో రెండు యూనివర్సిటీలు సంయుక్త సహకారంతో ముందుకెళ్తాయని చెప్పారు. ఏయూ ద్వారా రాష్ట్రంలోని ఏ విద్యార్థి అయినా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని చెప్పారు. యూకే ఇండియా ఎడ్యుకేషన్‌ పాలసీ ద్వారా ఈ కోర్సులు చేసే విద్యార్థులకు 10 శాతం ఫీజు రాయితీతో పాటు స్కాలర్‌షిప్‌ అందిస్తున్నట్లు వెల్లడించారు.

ప్రపంచంలోని టాప్‌ వర్సిటీల్లో ఏపీ విద్యార్థులు ఉన్నత చదువులు చదివి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచనలకు అనుగుణంగా ఆంధ్రా యూనివర్సిటీ విదేశాల్లోని ప్రఖ్యాత వర్సిటీలతో అవగాహన ఒప్పందాలు చేసుకుంటున్నట్లు వివరించారు.

కార్యక్రమంలో ఏయూ రెక్టార్‌ ఆచార్య కె.సమత, బేమ్‌ గ్లోబల్‌ సొసైటీ సీఈవో నవిందర్‌ కెప్లీష్, ఏయూ ఇంటర్నేషనల్‌ అఫైర్‌ అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు, ఏయూ మీడియా రిలేషన్స్‌ డైరెక్టర్‌ ఆచా­ర్య చల్లా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement