అలా చేస్తే ఉక్రెయిన్‌దే విజయం..బ్రిటిష్‌ రక్షణ మంత్రి బెన్‌ వాలెస్‌ | United Kingdom Boosts Military Support To Ukraine With High Tech Missile System | Sakshi
Sakshi News home page

అలా చేస్తే ఉక్రెయిన్‌దే విజయం..బ్రిటిష్‌ రక్షణ మంత్రి బెన్‌ వాలెస్‌

Published Tue, Jun 7 2022 8:29 AM | Last Updated on Tue, Jun 7 2022 8:38 AM

United Kingdom Boosts Military Support To Ukraine With High Tech Missile System - Sakshi

తాము అందజేసే హైటెక్‌ రాకెట్‌ సిస్టమ్స్‌తో ఉక్రెయిన్‌ సైనిక సామర్థ్యం బలోపేతం అవుతుందని బ్రిటిష్‌ రక్షణ మంత్రి బెన్‌ వాలెస్‌ సోమవారం చెప్పారు. రష్యా దాడులను తిప్పికొట్టేందుకు తాము అందజేసే ఆయుధాలు తోడ్పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సమాజం నుంచి సహకారం ఇలాగే కొనసాగితే రష్యాపై యుద్ధంలో ఉక్రెయిన్‌ విజయం సాధించడం తథ్యమని తేల్చిచెప్పారు.

80 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించే ఎం270 రాకెట్‌ వ్యవస్థలను ఉక్రెయిన్‌కు ఇవ్వబోతున్నట్లు యూకే రక్షణ శాఖ వెల్లడించింది.  రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ విదేశీ పర్యటన రద్దయ్యింది. నిజానికి ఆయన త్వరలో సెర్బియాలో పర్యటించాల్సి ఉంది. అయితే, లావ్రోవ్‌ విమానం తమ గగనతలంపై ప్రయాణించడానికి వీల్లేదని, అందుకు అనుమతి ఇవ్వబోమని సెర్బియా పొరుగు దేశాలైన బల్గేరియా, నార్తు మాసిడోనియా, మాంటినెగ్రో తేల్చిచెప్పాయి.
చదవండి: Russia-Ukraine war: రష్యా భీకర దాడులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement