కడుపు నొప్పితో విలవిల్లాడుతూ వాష్‌రూమ్‌లోకి వెళ్లిన యువతి అనుకోకుండా ఓ బిడ్డకు జన్మనిచ్చింది. యువతికి కనీసం పొట్ట పొరగడం, ప్రెగ్నెన్సీకి సంబంధించి ఎలాంటి లక్షణాలు కూడా లేకపోవడం మరింత చోద్యంగా మారింది. ఈ వింత ఘటన యూనైటెడ్ కింగ్‌డమ్‌లో వెలుగు చూసింది. జెస్ డేవిస్ అనే 20 ఏళ్ల యువతి యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్‌లో చదువుతోంది.
ఓ రోజు రాత్రి యువతికి తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో పీరియడ్స్(నెలసరి) అని భావించి వాష్‌రూమ్‌లోకి వెళ్లింది. టాయిలెట్‌లో కూర్చొని ఉండగా అకస్మాత్తుగా 3 కేజీల మగబిడ్డకు జన్మనివ్వడంతో ఆశ్చర్యపోయింది. అసలు తాను గర్భవతిననే విషయం కూడా ఆమెకు తెలియదు. ఇక బిడ్డను ప్రసవించిన మరుసటి రోజే జెస్ డేవిస్ తన 20వ పుట్టిన రోజును జరుపుకోవడం విశేషం.
విషయంపై సదరు యువతి మాట్లాడుతూ.. ‘నాకు పీరియడ్స్ ఎప్పుడూ రెగ్యులర్‌గా రావు. కాబట్టి నేను పెద్దగా పట్టించుకోలేదు. అప్పుడప్పుడు వికారంగా అనిపించేది. అందుకు కొన్ని మందులు వాడటం ప్రారంభించాను. ఆ రోజు ఉదయం తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. పీరియడ్స్ మొదలవుతున్నాయేమో అనుకున్నా. నడవలేని స్థిలిలో ఉన్నాను. కనీసం మంచం మీద పడుకోలేకపోయాను. అర్ధరాత్రి దాటాక కడుపునొప్పి ఎక్కువైంది. వెంటనే లేచి వాష్‌రూమ్‌కు వెళ్లా. నా పొట్టను కిందకు పుష్ చేశా.
చదవండి: అక్కడ పానీ పూరీ అమ్మకాలు నిషేధం! ఎందుకంటే?...
అప్పటికీ నాకు అనుమానం రాలేదు. కొద్దిసేపటి తర్వాత బిడ్డ ఏడుపు వినిపించింది. ఆ తరువాతే గానీ జరిగిందేంటో అర్థం కాలేదు. బాత్రూమ్‌లో బిడ్డను చూసి ముందు నేను కల కంటున్నానేమో అనుకున్నాను. కానీ జీవితంలో ఇంత కంటే పెద్ద షాక్ మరొకటి లేదు. వెంటనే షాక్ నుంచి తేరుకొని బిడ్డను చేతుల్లోకి తీసుకున్నా. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో వెంటనే నా స్నేహితురాలికి ఫోన్ చేసి విషయం చెప్పా. తాను అంబులెన్స్‌లో హాస్పిటల్‌కు వెళ్లామని చెప్పింది.
మొదట్లో శిశువుతో సమయం గడిపేందుకు కొంత టైం పట్టింది. కానీ ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను’ అని వివరించింది. ఆసుపత్రిలో శిశువును ఇంక్యుబేటర్‌లో ఉంచారు. శిశువు 35 వారాలకే జన్మించినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డ కోలుకుంటున్నారని పేర్కొన్నారు.
చదవండి: రోడ్డు మీద వెళ్తున్న మహిళ.. తలపై పడిన కొబ్బరికాయ.. వైరలవుతోన్న వీడియో
Comments
Please login to add a commentAdd a comment