university student
-
షాకింగ్.. కడుపు నొప్పితో టాయిలెట్లోకి వెళ్లి.. బిడ్డతో బయటకొచ్చిన యువతి
కడుపు నొప్పితో విలవిల్లాడుతూ వాష్‌రూమ్‌లోకి వెళ్లిన యువతి అనుకోకుండా ఓ బిడ్డకు జన్మనిచ్చింది. యువతికి కనీసం పొట్ట పొరగడం, ప్రెగ్నెన్సీకి సంబంధించి ఎలాంటి లక్షణాలు కూడా లేకపోవడం మరింత చోద్యంగా మారింది. ఈ వింత ఘటన యూనైటెడ్ కింగ్డమ్లో వెలుగు చూసింది. జెస్ డేవిస్ అనే 20 ఏళ్ల యువతి యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్‌లో చదువుతోంది. ఓ రోజు రాత్రి యువతికి తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో పీరియడ్స్(నెలసరి) అని భావించి వాష్‌రూమ్‌లోకి వెళ్లింది. టాయిలెట్లో కూర్చొని ఉండగా అకస్మాత్తుగా 3 కేజీల మగబిడ్డకు జన్మనివ్వడంతో ఆశ్చర్యపోయింది. అసలు తాను గర్భవతిననే విషయం కూడా ఆమెకు తెలియదు. ఇక బిడ్డను ప్రసవించిన మరుసటి రోజే జెస్ డేవిస్ తన 20వ పుట్టిన రోజును జరుపుకోవడం విశేషం. విషయంపై సదరు యువతి మాట్లాడుతూ.. ‘నాకు పీరియడ్స్ ఎప్పుడూ రెగ్యులర్‌గా రావు. కాబట్టి నేను పెద్దగా పట్టించుకోలేదు. అప్పుడప్పుడు వికారంగా అనిపించేది. అందుకు కొన్ని మందులు వాడటం ప్రారంభించాను. ఆ రోజు ఉదయం తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. పీరియడ్స్ మొదలవుతున్నాయేమో అనుకున్నా. నడవలేని స్థిలిలో ఉన్నాను. కనీసం మంచం మీద పడుకోలేకపోయాను. అర్ధరాత్రి దాటాక కడుపునొప్పి ఎక్కువైంది. వెంటనే లేచి వాష్‌రూమ్‌కు వెళ్లా. నా పొట్టను కిందకు పుష్ చేశా. చదవండి: అక్కడ పానీ పూరీ అమ్మకాలు నిషేధం! ఎందుకంటే?... అప్పటికీ నాకు అనుమానం రాలేదు. కొద్దిసేపటి తర్వాత బిడ్డ ఏడుపు వినిపించింది. ఆ తరువాతే గానీ జరిగిందేంటో అర్థం కాలేదు. బాత్రూమ్లో బిడ్డను చూసి ముందు నేను కల కంటున్నానేమో అనుకున్నాను. కానీ జీవితంలో ఇంత కంటే పెద్ద షాక్ మరొకటి లేదు. వెంటనే షాక్ నుంచి తేరుకొని బిడ్డను చేతుల్లోకి తీసుకున్నా. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో వెంటనే నా స్నేహితురాలికి ఫోన్ చేసి విషయం చెప్పా. తాను అంబులెన్స్‌లో హాస్పిటల్‌కు వెళ్లామని చెప్పింది. మొదట్లో శిశువుతో సమయం గడిపేందుకు కొంత టైం పట్టింది. కానీ ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను’ అని వివరించింది. ఆసుపత్రిలో శిశువును ఇంక్యుబేటర్‌లో ఉంచారు. శిశువు 35 వారాలకే జన్మించినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డ కోలుకుంటున్నారని పేర్కొన్నారు. చదవండి: రోడ్డు మీద వెళ్తున్న మహిళ.. తలపై పడిన కొబ్బరికాయ.. వైరలవుతోన్న వీడియో -
మావో వేడుకలపై చైనా ఉక్కుపాదం
బీజింగ్: స్వతంత్ర చైనా తొలి చైర్మన్ మావో జెండాంగ్ 125వ జయంతి వేడుకలపై షీ జిన్‌పింగ్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. మావో జయంతి వేడుకలు జరిపేందుకు సిద్ధమైన పెకింగ్ విశ్వవిద్యాలయం విద్యార్థి, వర్సిటీ మార్క్సిస్ట్ సొసైటీ చీఫ్ క్వీ హంక్సువాన్ను అరెస్ట్ చేసింది. పెకింగ్ విశ్వవిద్యాలయం ప్రవేశద్వారం వద్దకు సాధారణ దుస్తుల్లో వచ్చిన 8మంది పోలీసులు నల్లటికారులో క్వీని బలవంతంగా ఎక్కించారు. ఈ సందర్భంగా అతను ‘నేను క్వీ హాంక్సువాన్ను. నేను చట్టాన్ని ఉల్లంఘించలేదు. నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు’ అని అధికారులతో పెనుగులాడాడు. చైనాలో 1989లో తియానన్మెన్ కూడలిలో ఉవ్వెత్తున ఎగిసి ప్రజాస్వామ్య ఉద్యమంలో పెకింగ్ విశ్వవిద్యాలయం విద్యార్థులు కీలకపాత్ర పోషించారు. అయితే కొన్నేళ్ల క్రితం అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన షీ జిన్‌పింగ్, చైనా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి సంఘాలు, వాటి కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపారు. తాజాగా క్వీ అరెస్టుపై చైనా ప్రభుత్వం, పెకింగ్ విశ్వవిద్యాలయం ఇంకా స్పందించలేదు. -
గోరింటాకు పెట్టుకుంటే.. చేతులు కాలాయి!
చేతులకు గోరింటాకు అందమని బ్లాక్ హెన్నా పెట్టించుకుంటే.. ఆ యువతి చేతులు తీవ్రంగా కాలిపోయాయి. దాంతో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది. ఈ ఘటన షార్జాలో జరిగింది. యూనివర్సిటీలో జరుగుతున్న ఓ కార్యక్రమం సందర్భంగా హెన్నా పెట్టుకుందామని ఆ యువతి ప్రయత్నించింది. డిజైన్ పెట్టుకున్న అరగంటలోనే ఆమె చేతుల మీద విపరీతంగా బొబ్బలు వచ్చాయి. దాంతో వెంటనే ఆమె చేతులు కడుక్కుంది. అయినా మంట తగ్గకపోవడంతో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమెకు వెంటనే చేతులకు హైడ్రోకార్టిజోన్ ఆయింట్మెంట్ రాసి, టాబ్లెట్లు ఇచ్చారు. తాను రెడ్ హెన్నా పెడుతున్నానని హెన్నా ఆర్టిస్ట్ చెప్పిందని, కానీ అది డార్క్‌గా ఉండటంతో తనకు అనుమానం వచ్చిందని బాధిత విద్యార్థిని చెప్పింది. బ్లాక్ హెన్నా వాడటం ప్రమాదకరమని తనకు తెలుసని ఆమె చెబుతోంది. అయితే ఆస్పత్రికి వెళ్లిన వారం రోజుల తర్వాత ఎలర్జీ మరింత తీవ్రతరం కావడంతో ఆమెను అక్కడే ఎమర్జెన్సీకి తరలించారు. ప్రతిరోజూ తనకు టాబ్లెట్లతో పాటు పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్లు కూడా ఇస్తున్నారని, ఈ నొప్పి భరించలేకపోతున్నానని వాపోయింది. బాధితురాలికి హైబీపీ కూడా ఉండటంతో ఆమెకు గుండె నొప్పి రావడం మొదలైంది. దాంతో చికిత్స మొత్తం మార్చాల్సి వచ్చింది. చేతుల మీద వాపు తగ్గడానికి ప్రతి రెండు గంటలకోసారి ఐస్ ప్యాక్ పెడుతున్నారు. బొబ్బల కారణంగా ఇప్పటికీ వేళ్లు మడవలేకపోతున్నానని, రాత్రిపూట కూడా మంటలు, దురద ఎక్కువ కావడంతో నిద్ర పట్టడం లేదని ఆమె తెలిపింది. యూనివర్సిటీ వర్గాలు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నాయి.