ప్రపంచవ్యాప్తంగా 20 మంది ఎంపిక..
రాయదుర్గం: యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ది సైన్స్ బరీ లాబోరేటరీ సమ్మర్ కాన్ఫరెన్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా 20 మందికి అవకాశం కలి్పంచగా అందులో హెచ్‌సీయూ విద్యారి్థనికి అవకాశం లభించింది. హెచ్‌సీయూలో స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ పరిశోధక విద్యార్థి ప్రజ్ఞాప్రియదర్శిని ఎంపికయ్యారు. ‘ప్రారంభ కెరీర్ పరిశోధకుల కోసం మొక్కలు–సూక్ష్మజీవుల పరస్పర చర్యలపై వేసవి సదస్సు’లో పాల్గొనేందుకు అవకాశం రావడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేశారు.
ఇటీవల ప్రారంభమైన ఈ సదస్సు ఈనెల 26 వరకూ సాగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి 20 మంది పరిశోధకులను ఎంపిక చేశారు. ఇందులో 20 మంది అంతర్జాతీయ ప్రతిని«ధులు, 8 మంది ముఖ్య వక్తలు, 10 మంది స్థానిక వక్తలు భాగస్వాములయ్యారు. ప్రజ్ఞ హెచ్‌సీయూలోని డిపార్ట్‌మెంట్ ఆప్ ప్లాంట్ సైన్సెస్ ప్రాఫెసర్ ఇర్ఫాన్ ఆహ్మద్‌ఘాజీ పర్యవేక్షణలో పనిచేస్తున్నారు. ఆమె థీసిస్ వివిధ రకాల వరి(ఒరైజాసటైవా)లో బాక్టీరియల్ లీఫ్ బ్లెట్(బీఎల్‌బీ) నిరోధకతకు సంబంధించిన జన్యువుల గుర్తింపుపై ఆధారపడింది.
Comments
Please login to add a commentAdd a comment