
శంషాబాద్: బ్రిటిష్ ఎయిర్‌వేస్ సర్వీసులు శుక్రవారం నుంచి పునః ప్రారంభం కానున్నట్లు శంషాబాద్ విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. కోవిడ్ రెండో రకం వైరస్‌తో భారత్–బ్రిటన్ మధ్య విమాన రాకపోకలపై జనవరి 7 వరకు కేంద్రం నిషేధం విధించింది. వీటిని శుక్రవారం నుంచి తిరిగి ప్రారంభిస్తున్నట్లు బ్రిటిష్ ఎయిర్‌వేస్ పేర్కొం ది. అయితే ప్రయాణానికి ముందు 72 గంటల్లోపు చేయించుకున్న ఆర్ టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టును కలిగి ఉండాలనే నిబంధనలను కఠినతరం చేశారు. కాగా బ్రిటన్‌లో స్ట్రెయిన్ కేసులు ఉధృతమవుతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి మూడో వారం వరకు కఠిన నిబంధనలు అమలు చేస్తామని ప్రధాని బోరిస్ జాన్‌సన్ వెల్లడించారు.(చదవండి: స్ట్రెయిన్ విజృంభణ.. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్)