న్యూఢిల్లీ: కొత్త రకం కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. కోవిడ్-19 మహమ్మారి ముప్పు త్వరలో తొలగిపోనుందన్న ఆశలపై నీళ్లు చల్లుతూ.. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదకర వైరస్‌గా బ్రిటన్‌లో మొదట గుర్తించిన ‘వీయూఐ 202012/1’ ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేస్తోంది. ఇప్పటివరకు డెన్మార్క్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, బెల్జియం, ఇటలీ దేశాల్లోనూ అడుగుపెట్టన ఈ వైరస్ తాజాగా భారత్‌లో కూడా వెలుగులోకి వచ్చినట్లు వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లండన్ నుంచి వచ్చిన ప్రయాణికులలో కరోనా వైరస్ బయటపడింది. ఇప్పటి వరకు లండన్ నుంచి వచ్చిన 8 మందికి కరోనా వైరస్ సోకింది. చదవండి: కరోనా 2.O: వైరస్ కొత్త రూపం, అసలు కథేంటి?
సోమవారం రాత్రి ఢిల్లీకి వచ్చిన 266 మంది ప్రయాణికులలో కొత్తగా ఎనిమిది మంది ప్రయాణికులకు కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్థారణ అయింది.ఈ క్రమంలో కరోనా నిర్థారణ అయిన వారిలో ‘వీయూఐ 202012/1’ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైరస్ నిర్థారణ అయిన ఎనిమిది మందిలో ఢిల్లీకి చెందిన వారు ఐదుగురు, కోల్‌కతా ఇద్దరు, చెన్నైకి చెందిన ఒకరు ఉన్నారు. చెన్నైకి చెందిన వైరస్ బాధితుడి నమూనాలను పుణేకు పంపినట్లు వైద్యులు తెలిపారు. పూర్తిస్థాయి నివేదికలు వెల్లడయ్యేవరకు కొత్త కరోనా వైరస్‌ను నిర్ధారించలేమని వైద్యులు పేర్కొన్నారు. చదవండి: బ్రిటన్ విమానాలపై నిషేధం
Comments
Please login to add a commentAdd a comment