![India: Highest In 24 Hours, 4205 Covid Deaths - Sakshi](/styles/webp/s3/article_images/2021/05/12/corona.gif.webp?itok=i4_7GHGC)
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ వ్యాప్తి కొనసాగుతోంది. గత నాలుగు రోజుల నుంచి కొత్త కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నప్పటికీ మరణాలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,48,421 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకే రోజు 4,205 మంది మృతిచెందారు. మంగళవారం నాడు 3,55,338 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,33,40,938 చేరింది. మరణాల సంఖ్య 2,54,197కు పెరిగింది.
ఈ మేరకు బుధవారం కేంద్ర వైద్యారోగ్యశాఖ కరోనాపై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీని ప్రకారం ప్రస్తుతం 37,04,099 యాక్టివ్ కేసులున్నాయి మహమ్మారి నుంచి ఇప్పటి వరకు 1,93,82,642 మంది బాధితులు కోలుకున్నారు. మొత్తం 17,52,35,991 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.
చదవండి: Lockdown: కిక్కిరిసిన సూపర్ మార్కెట్లు, బారులు తీరిన జనాలు
Comments
Please login to add a commentAdd a comment