కొంతమంది ఎలాంటి సాహసాలు చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. రికార్డులు, ఫేమస్ అవ్వడం కోసం హద్దులు చెరిపేసి ఎంత రిస్క్ చేసేందుకైనా వెనకాడరు. ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది. రిస్క్ చేస్తన్నంతసేపు టెన్షన్‌తో రోమాలు నిక్కపొడుచుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. అయితే ఇది ఇప్పటిది కాదు. 17 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనకు సంబంధించినది. దీనిని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ మళ్లీ తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో పోస్టు చేసింది.
వివరాల్లోకి వెళితే బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి రెండు హాట్ ఎయిర్ బెలూన్ల మధ్య నడుస్తూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. మైక్ హోవార్డ్ అనే వ్యక్తి 21,00 అడుగులు(6,522 మీటర్లు) ఎత్తులో రెండు హాట్ ఎయిర్ బెలూన్‌లను కలిపే మెటల్ ప్లాంక్‌పై తీగల సాయంతో నడుస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. ఇది 50 ఏళ్లు, 50 రికార్డులు టీవీ షో కోసం 2004 సెప్టెంబర్ 1న తీసిన వీడియో. తాజాగా మళ్లీ వైరలవ్వడంతో నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు. హోవార్డ్ ధైర్య సాహసాలను మెచ్చుకోవడంతోపాటు ఆశ్చర్యపోతున్నారు. మరికొందరు ఇలా చేయడం చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.
చదవండి: కూరగాయలు అమ్ముతున్న ఐఏఎస్ అధికారి.. అసలు నిజం ఇదే!
Viral Video : సముద్ర తీరంలో అద్భుతం!
Comments
Please login to add a commentAdd a comment