దుబాయ్లో తెలుగు వెలుగులు | WAVE Resonance Events 7th Anniversary celebrations in Dubai | Sakshi
Sakshi News home page

దుబాయ్లో తెలుగు వెలుగులు

Published Sat, Jun 14 2014 8:00 PM | Last Updated on Sat, Sep 2 2017 8:48 AM

దుబాయ్లో తెలుగు వెలుగులు

దుబాయ్లో తెలుగు వెలుగులు

దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని తెలుగువారు 'వేవ్ రెసోనెన్స్ ఈవెంట్స్' ఏడో వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. యూఏఈలోని ఏడు ఎమిరేట్స్ కలయికగా ఇంద్రధనుస్సులోని ఏడు వర్ణాల శోభతో దుబాయి డేయిరా ఎమిరేట్స్ హాల్ లో ఈ నెల 6న ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఏడు ఎమిరేట్స్లోని తెలుగువారు ఈ వైభవాన్ని తిలకించడానికి తరలిరాగా, ముఖ్య అతిథిగా దక్షిణ భారత నటి శ్రీమతి సుహాసిని మణిరత్నం విచ్చేసారు. టీవీ యాంకర్ శశి కార్యక్రమాన్ని సరదాగా నిర్వహించారు. భారతీయ సాంప్రదాయ కళలకు అద్దం పట్టేలా వేవ్ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి.

విశేషాలు

  • వేవ్ ప్రెసిడెంట్ శ్రీమతి గీతా రమేష్ మరియు ముఖ్య అతిథి శ్రీమతి సుహాసిని మణిరత్నం  దీపారాధన తో కార్యక్రమం ప్రారంభం
  • గణపతి ప్రార్థన మరియు కుమారి మోనిక నారాయణన్ భరతనాట్యంతో వినోద కార్యక్రమాలు
  • కవలలైన కుషిత్ కుష్మిత్ల గాత్రం
  • ఆభయకారుడయిన శ్రీ హనుమంతుని జయకార నాట్యం చేసిన బాలురు. ఆకర్షించిన చిన్ని హనుమంతుడు
  • వేవ్ సభ్యులు చేసిన మాయాబజార్, శశిరేఖ పరిణయం హాస్య కార్యక్రమం
  • డిస్ని ఫేయిరి టేల్స్లో బహుళ ప్రాచుర్యం పొందిన కథలను కలిపి చిన్నారుల నృత్యరూపకం
  • తెలంగాణ సాంప్రదాయమైన బోనాలు పండుగ పాటకు మహిళల జానపద నృత్యం
  • మహారాష్ట్ర సుప్రసిద్ధమైన లావణి మరియు మృత్స్యకారుల నృత్య కదంబం యువతీయువకులచే
  • గీతా రమేష్ నేతృత్వంలో కన్నులపండుగగా సాగిన ఈ వార్షికోత్సవంలో సుహాసిని పాటలు పాడటం, వేవ్ సభ్యులతో కలిసి డాన్స్ చేయటం ప్రత్యేక ఆకర్షణ.
  • తెలుగువారి ఆరాధ్యదైవం ఏడుకొండల శ్రీనివాసుని కళ్యాణ కార్యక్రమం. యూఏఈ చిన్నారులు శాస్త్రీయ నృత్యరూపకం
  • గోవిందనామ స్మరణతో ఆడిటోరియం మారుమోగగా సభికులు హర్షధ్వానాలతో చిన్నారులని దీవించారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement