తెలుగు అసోసియేషన్-యూఏఈ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం దుబాయ్‌లో అట్టహాసంగా నిర్వహించారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ, ఆంధప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యవస్థాపక సభ్యుల ప్రతినిధులు నియమితులైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో హైదరాబాద్‌కు చెందిన బాలుస వివేకానంద చైర్మన్‌గా ఎన్నికవగా, వైస్ చైర్మన్‌గా సుదర్శన కటారు, అధ్యక్షుడిగా మసివుద్దీన్ మొహమ్మద్, నాయకత్వ బాధ్యతలు నిర్వహించారు.
వీరితో పాటు ప్రధాన కార్యదర్శి విజయ భాస్కర్ రెడ్డి, కోశాధికారి శ్రీనివాస్ గౌడ్ వాడకొండ, మార్, వంగ్ డైరెక్టర్ శ్రీనివాసరావు యెండూరి, అంతర్జాతీయ వ్యవహారాల విభాగ డైరెక్టర్‌గా సురేంద్రనాథ్ ధనేకుల,ఆంధ్రప్రదేశ్ సంక్షేమ కార్యక్రమాల విభాగ డైరెక్టర్‌గా శ్రీధర్ దామర్ల , తెలంగాణ సంక్షేమ కార్యక్రమాల విభాగ డైరెక్టర్‌గా చైతన్య చకిల సేవల డైరెక్టర్స్‌గా భీం సంకర్ బంగారి, సాంస్కృతిక కార్యక్రమాల విభాగ డైరెక్టర్‌గా శ్రీమతి లతా నగేష్ మీడియా విభాగ డైరెక్టర్‌గా అబ్దుల్ ఫహీం షేక్ , న్యాయ మరియు కార్యాలయ వ్యవహారాల విభాగ నిర్వహకుడిగా సత్యసాయి ప్రకాష్ సుంకు బాధ్యతలు స్వీకరించారు.
నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులందరూ ఒక్కక్కరుగా వేదికపైకి విచ్చేసి మాతృభాషలో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి, గల్ఫ్ మైనారిటీ కమ్యూనిటీ (GMC) తరపున అబ్దుల్లా, ఖాజా, షరీఫుద్దీన్, జాఫర్ అలీ, ఆంధ్రప్రదేష్ ప్రవాసీయుల తెలుగు సంఘం (APNRT) తరపున అక్రం, చక్రి, ఉదయభాస్కర్ రెడ్డి విచ్చేసి నూతన కార్యవర్గ సభ్యులందరిని శాలువాలతో సత్కరించి, అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా తెలుగు అసోసియేషన్ సాధించిన ప్రగతిని ప్రశంసిస్తూ, నూతన కార్యవర్గం రాబోయే రెండేళ్లలో మరెన్నో మంచి కార్యక్రమాలతో ముందుకు రావాలని,యూఏఈలోని తెలుగు వారందరినీ కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఒకే తాటిపైకి తెచ్చేందుకు మరింత చొరవ చూపాలని ఆకాంక్షించారు. పదవీ విరమణ చేసిన కోశాధికారి మురళీకృష్ణ, నూతన కార్యవర్గ సభ్యులందరికి పుష్పగుచ్చము అందజేసి పూలమాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చైర్మన్ వివేకానంద్ బలుసు , అధ్యక్షుడు మన్మద్దీన్ మొహమ్మద్ ప్రసంగిస్తూ తమ నూతన కార్యవర్గం ప్రణాళికలను క్లుప్తంగా అందిరికి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment