విదేశీ విశ్వవిద్యాలయాల్లో తెలుగు పీఠాల ఏర్పాటుకు తీర్మానం | Translations of foreign universities to set up altars resolution | Sakshi
Sakshi News home page

విదేశీ విశ్వవిద్యాలయాల్లో తెలుగు పీఠాల ఏర్పాటుకు తీర్మానం

Published Fri, Oct 17 2014 1:39 AM | Last Updated on Sat, Sep 2 2017 2:57 PM

విదేశీ విశ్వవిద్యాలయాల్లో తెలుగు పీఠాల ఏర్పాటుకు తీర్మానం

  • ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్
  • అవనిగడ్డ : తెలుగును ప్రపంచ భాషగా గుర్తించాలని, విదేశాల్లో ఉన్న విశ్వవిద్యాలయాల్లో తెలుగు పీఠాలు ఏర్పాటు చేయాలని కోరుతూ యూకే (యునెటైడ్ కింగ్‌డమ్) తెలుగు సంఘం సభల్లో ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ చెప్పారు. ఆయన స్థానిక తన కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు.

    బ్రిటన్, అమెరికాలో పర్యటిం చిన తాను, తెలుగు భాష, సంస్కృతుల పరిరక్షణకు ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రులతో చర్చించినట్లు చెప్పారు. గూగుల్ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపి ప్రపంచ భాషగా తెలుగును గుర్తించి, గూగుల్‌లో చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు. తమ విజ్ఞప్తిని మన్నించినా సంస్థ ప్రతినిధులు మరుసటి రోజే గూగుల్‌లో తెలుగుకు స్థానం కల్పించారని, ప్రత్యేక తెలుగు పాంట్లు రూపొందించారని వివరించారు.

    ప్రపంచ విద్యావ్యవస్థలో తెలుగుకు రెండో భాషగా ప్రాముఖ్యత కల్పించడానికి తాముచేసిన కృషి సత్ఫాలితలనిచ్చే దిశగా సాగుతోందన్నారు. గత నెల 26, 27 తేదీల్లో జరిగిన ప్రపంచ తెలుగు సాంస్కృతిక కార్యక్రమంలో ప్రపంచ భాషగా తెలుగుకు గుర్తింపు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. విదేశీయులు సైతం తెలుగు అభ్యసించటానికి ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు.
     
    జన్మభూమిపై ప్రవాసాంధ్రుల ఆసక్తి

    రాష్ట్రంలో అమలుచేస్తున్న జన్మభూమి కార్యక్రమంపై ప్రవాసాంధ్రులు ఆసక్తి చూపుతున్నారని బుద్ధప్రసాద్ చెప్పారు. ఈ కార్యక్రమం స్ఫూర్తితో వారు జన్మించిన గ్రామాల అభివృద్ధికి కృషి చేయడానికి నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. అమెరికాలో సమావేశాలు జరుగుతున్న తరుణంలోనే తుపాను నష్టంపై ప్రాథమిక సమాచారం అందించటంతో స్పందించిన అమెరికాలోని తెలుగువారు విరాళాలు ప్రకటించారని బుద్ధప్రసాద్ తెలిపారు. ఎన్‌టీఆర్ సుజల స్రవంతి, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ కార్యక్రమంలో ప్రవాసాంధ్రులను భాగస్వాములను చేయటానికి వారికి సహకారం అందించటానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల ఏర్పాటుకు ప్రవాసాంధ్రులు   ఆసక్తితో ఉన్నారని పేర్కొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement