గూగుల్ కాదు... మా ఊరు గూల్
బ్రిటన్‌లోని యార్క్‌షైర్ కౌంటీలో ‘గూల్’ అనే పేరుతో ఓ పట్టణం ఉంది. దీని జనాభా 19,000. అయితే తాము నివసించే పట్టణానికి సంబంధించి ఏదైనా సెర్చ్ చేద్దామని గూగుల్‌లో వెతికితే.... గూల్ (Goole) అని కొట్టగానే ‘మీ ఉద్దేశం గూగులా?’ అని వచ్చేదట. దాంతో చిర్రెత్తుకొచ్చిన ఇక్కడి మ్యూజియంలో పనిచేసే కొందరు ఔత్సాహికులు తామే గూల్ పేరిట ఒక సెర్చ్ ఇంజన్‌ను ప్రారంభించారు.
వందల ఏళ్ల చరిత్ర ఉన్న తమ పట్టణానికి సంబంధించిన 200 చారిత్రకప్రదేశాలు, ఇతర విశేషాలను ఇందులో పొందుపర్చారు. గూగుల్ నిన్నగాక మొన్న (1998లో) పుట్టింది. మా పట్టణం ఒకటుందనే సంగతినే ఈ గూగుల్ మరుగునపర్చేలా ఉంది. దాంతో మేమే మా ఊరి గురించి చెప్పుకుంటున్నామంటున్నారు స్థానికులు.