అనంతపురం కలెక్టరేట్,న్యూస్‌లైన్: ప్రభుత్వ ఉద్యోగులమైనా అంతకన్నా ముందుగా తెలుగు జాతి బిడ్డలుగా, భారతీయులుగా రాష్ట్ర విభజన అంశంపై ఉద్యమం చేస్తున్నామని రెవె న్యూ ఉద్యోగుల సంఘం రాష్ర్ట అధ్యక్షుడు బోపరాజు వెంకటేశ్వర్లు అన్నారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట రెవెన్యూ ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహారదీక్షల శిబిరాన్ని సోమవారం ఆయ న సందర్శించి మద్దతు తెలిపారు. ఆ యన మాట్లాడుతూ రూ.2 వేల వేతనం వచ్చే వీఆర్‌ఏల నుంచి డెప్యూటీ కలెక్టర్ వరకు అందరూ ఉద్యమంలో పాల్గొం టున్నారన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ప్రజలే స్వచ్ఛందంగా నిర్వ హిస్తున్నారన్నారు. అన్ని వర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చి ఎక్కడికక్కడ పాలన స్తంభింప చేస్తున్నారన్నారు. ఈ నెల 25న చిత్తూరు జిల్లా నుంచి వైఎస్సార్ జిల్లాకు వచ్చేందుకు తనకు 12 గంటల సమయం పట్టిందని, దీనిని బట్టి గ్రామగ్రామాన ఉద్యమం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందన్నారు.
ఇంత పెద్ద ఎత్తు న ఉద్యమం జరుగుతుండగా ఉద్యోగు ల జేఏసీ నాయకులను డెప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ నేతృ త్వం లోని రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ చర్చలకు పిలిచి ఉద్యమం విరమించుకోవాలని కోరిందన్నారు. అసలు ఆ కమిటికీ చట్టబద్ధత లేదని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే అధికారం కూడా లే ని ఆ కమిటీ సూచిస్తే ఉద్యమం ఆపాలా అని ప్రశ్నించారు. ఆర్టీసీ ఉద్యోగులు ఉద్యమంలో పాల్గొనడం అభినంద నీయ మన్నారు. సీమాంధ్రలోని 13 జిల్లాలకు అనంతపురం జిల్లాలో కొనసాగుతున్న ఉద్యమం ఆదర్శనీయమన్నారు. రాజ దాని అంటే అసెంబ్లీ, సెక్రటరియే ట్ మాత్రమే కాదని 140 కేంద్ర ప్రభుత్వ సంస్థలు, 214 పబ్లిక్ సెక్టార్‌కు సంబంధించిన కీలక కార్యాలయాలు, ఫార్మా, విద్యాలయాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఈ నెల 31 వరకు ఉద్యమం సాగుతుందని అనంతరం భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నట్లు వెల్లడించారు.
ఉద్యోగుల ఐక్యకార్యచరణ సమితి చైర్మన్ హేమసాగర్ మాట్లాడుతూ ఉద్యమాన్ని మరింత ఉదృ తం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఎన్‌జీఓ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు దేవరాజు మాట్లాడుతూ సమైక్య ప్రకటన వచ్చే దాకా ఉద్యమం ఆగదన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంజిప్రసాద్, వీఆర్‌ఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భక్తవత్సలం, వీఆర్‌ఏల సంఘం రాష్ర్ట అధ్యక్షుడు గోపాల్ రావు, రెవెన్యూ టైపిస్ట్ కం కంప్యూటర్ ఆపరేటర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దయాకర్, గెజిటెడ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు తిమ్మప్ప, రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి, కార్యదర్శి జయరామప్ప, కోశాధికారి నీలకంఠారెడ్డి, రుణ సహకార సంఘం ఉపాధ్యక్షుడు రామాం జులరెడ్డి, క్రీడలు,సాంస్కృ తిక విభాగం జిల్లా అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతి బిడ్డలుగా ఉద్యమిస్తున్నాం..
Published Tue, Aug 27 2013 4:35 AM | Last Updated on Fri, Sep 1 2017 10:08 PM
Advertisement
Advertisement