
దక్షిణ కొరియాలో ఉగాది సంబరాలు
దక్షిణ కొరియా తెలుగు సంఘం(టాస్క్) ఆధ్వర్యంలో ఆదివారం దుర్ముఖినామ ఉగాది సంబరాలు ఘనంగా నిర్వహించారు. సియోల్ దగ్గరగా ఉన్న సువాన్ నగరంలోని క్యోంఘీ విశ్వ విద్యాలయంలో ఈ సంబరాలు జరిగాయి. ఇందులో దక్షిణ కొరియాలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న తెలుగు ఉద్యోగులు, విద్యార్థులు తమతమ కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. పూజ, పంచాంగ శ్రవణం అనంతరం ఆటపాటలతో ఆనందంగా గడిపారు. ‘టాస్క్’ కమిటీ సభ్యులు హరినారాయణ అంకంరెడ్డి, డాక్టర్ కోపల్లి స్పందన వేడుకలను పర్యవేక్షించారు.