తెలుగు భాష, సాహిత్య, సాంస్కృతిక రంగాలకు పట్టం కట్టే ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్.. సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించింది. ఫ్రిస్కోలోని రీడీ హై స్కూల్‌లో జరిగిన ఈ వేడుకలకు ప్రవాసులు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి సందడి చేశారు. సంస్థ అధ్యక్షులు సతీష్ బండారు ఆధ్వర్యంలో కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను బావితరం మర్చిపోకుండా సంక్రాంతి సంబరాలలో పలు కార్యక్రమాలు చేపట్టింది టాంటెక్స్.
సంక్రాంతి పాటలు, ముగ్గులు, ముచ్చట్లతో పాటు అత్యంత సుందరంగా బొమ్మల కొలువుతో వేదికను అలంకరించారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాయి. ప్రముఖ సింగర్స్ శ్రీకాంత్, దీప్తి తమ గాత్రంతో ఆకట్టుకున్నారు. సంక్రాంతి గొప్పతనం చాటిచెప్పేలా కార్యక్రమాలు ఏర్పాటు చేసి పండగ వాతారవరణాన్ని సృష్టించారు. ఈ సందర్భంగా పలు పోటీలు నిర్వహించి, బహుమతులు అందజేశారు. సంక్రాంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన పలు స్టాల్స్‌కు విశేష స్పందన వచ్చింది.
ఇక సంస్థ ఆధ్వర్యంలో జరిగిన స్వచ్చంద మరియు సాంస్కృతిక కార్యక్రమాలను వివరించారు. నార్త్ అమెరికా తెలుగు సొసైటీ నాట్స్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. మార్చిలో నాట్స్ సంబరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డల్లాస్‌లో జరిగే నాట్స్ తెలుగు వేడుకల్లో అందరికీ పాల్గొని విజయవంతం చేయాలని సంస్థ సభ్యులు కోరారు. ఇక సంక్రాంతి సంబరాలు గ్రాండ్ సక్సెస్ అవటం పట్ల నిర్వహకులు ఆనందం వ్యక్తం చేశారు. సంస్థ మద్దతుగా ఉంటూ సహాయసహాకారాలు అందిస్తున్న దాతలకు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
(చదవండి: సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు)
Comments
Please login to add a commentAdd a comment