టోక్యో: దేశంలో అత్యధికంగా ఉన్న ఒంటరి యువతీయువకులకు జపాన్ దేశం ఒక బంపర్ ఆఫర్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒంటరిగా ఉన్న యువతీ యువకులు అద్దె చెల్లించి బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ ని సొంతం చేసుకోవచ్చు.
పెళ్లికాని యువతీయువకుల ఆవేదనని అర్ధం చేసుకుంది జపాన్ ప్రభుత్వం. జీవితంలో ఎవ్వరి తోడులేక మొడుబారిన ఒంటరి వ్యక్తుల బ్రతుకుల్లో కొత్త ఆశలను చిగురించేలా చేసింది. ఆన్లైన్ పోర్టల్ ద్వారా యువతీ యువకులు గంటల ప్రతిపాదికన సహచరులను ఎంపిక చేసుకునే బృహత్తర కార్యక్రమానికి ఆమోదం తెలిపింది.
దీంతో జపాన్ దేశంలో బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ లేనివారు ఎవరైనా అద్దెకు వారిని పొందవచ్చు. గంటకు రూ.3000 చెల్లించి బాయ్ ఫ్రెండ్ లేనివారు ప్రియుడిని గర్ల్ ఫ్రెండ్ లేని వారు ప్రియురాలిని సొంతం చేసుకోవచ్చు. ఎంచుకునే అభ్యర్థిని బట్టి అదనంగా మరో 1200 చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు సదరు ఆన్లైన్ పోర్టల్ నిర్వాహకులు.
షిహో అనే ఒక ఆన్లైన్ గర్ల్ ఫ్రెండ్ మాట్లాడుతూ ఈ సర్వీసును వినియోగించుకునే వారిలో అత్యధికులు వారి జీవితంలో ఎటువంటి తోడు లేనివారు, పెళ్లి కానీవారే. ఈ సేవలు వినియోగించుకునే వారు ఆన్లైన్ పార్ట్ నర్ కు ఎటువంటి ఖరీదైన కానుకలు ఇవ్వడానికి లేదు, డైరెక్టుగా మాట్లాడే అవకాశమూ లేదు. ఆన్లైన్ బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ కావాలనుకునేవారు వీటితోపాటు అనేక నిబంధనలను కూడా పాటించాల్సి ఉంటుందని తెలిపారు.
ఈ సర్వీసు ఏదో బాగుంది కదూ. కేవలం బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ మాత్రమే కాదు, జపాన్ దేశంలో కుటుంబ సభ్యులు కావాలన్నా కూడా అద్దెకు దొరుకుతారట.
ఇది కూడా చదవండి: సంప్రదాయం పేరిట సముద్రంలో దారుణం..
Comments
Please login to add a commentAdd a comment