ఎయిర్‌పోర్ట్‌లోని రన్‌వేపై రెండు ప్యాసింజర్ విమానాలు ఢీ కొన్నాయి. దీంతో అధికారులు రన్‌వేని మూసేశారు. ఈ ఘటకు గల కారణాలు అస్పష్టంగా ఉన్నాయి. ఈ ప్రమాదం జపాన్ రాజధాని టోక్యలో హనెడా విమానాశ్రయం వద్ద చోటుచేసుకుంది. ఈ షాకింగ్ ఘటనలో ప్రయాణికులకు తీవ్ర గాయలైనట్లు జపాన్ మీడియా పేర్కొంది. అయితే ప్రభుత్వం మాత్రం ఎవరికీ ఏం కాలేదని అంటోంది.
టోక్యోలోని హనెడా విమానాశ్రయం వద్ద టాక్సీవేలో ప్రయాణికులతో కూడిన రెండు విమానాలు ఢీ కొన్నాయి. దీంతో రన్‌వే ఒక్కసారిగా మూసివేశారు అధికారులు. బ్యాంకాకు బయలుదేరిని థాయ్ ఎయిర్‌వేస్ ఇంటర్నేషనల్ జెట్ ప్రమాదవశాత్తు తైపీకి వెళ్తున్న ఎవా ఎయిర్‌వేస్ విమానాన్ని ఢీ కొట్టింది. ఈ షాకింగ్ ఘటన కారణంగా మిగతా విమానాలకు అంతరాయం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు.
జపాన్ రవాణా మంత్రిత్వ శాఖ ఈ ఘటన శనివారం ఉదయం 11 గంటలకు జరిగినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, ఎలాంటి నష్టం వాటిల్ల లేదని పేర్కొంది. కానీ జపాన్ స్థానిక మీడియాలు మాత్రం ప్రయాణికులు కొద్దిపాటి గాయాలయ్యాయని, అలాగే ఓ విమానం రెక్కదెబ్బతిందని పేర్కొంది. ఈ ప్రమాద సమయంలో టోక్యో విమానాశ్రయం సత్వరమే స్పందించడంలో జాప్యం చేసిందని పలు విమర్శనాత్మక కథనాలు వెలువరించడం గమనార్హం. కాగా, అసలు ఈ ఘటనకు దారితీసిన కారణాలేంటో తెలియాల్సి ఉంది.
(చదవండి: రాజ భవనంలాంటి ఆ బంగ్లా.. ఎలుకలు ఉన్నాయని కూల్చేస్తున్నారు!)
Comments
Please login to add a commentAdd a comment