జపాన్‌లో భారీ భూకంపం.. 155సార్లు కంపించిన భూమి | Japan Earthquake Updates In Telugu | Sakshi
Sakshi News home page

జపాన్‌లో భారీ భూకంపం.. 155సార్లు కంపించిన భూమి

Published Tue, Jan 2 2024 8:11 AM | Last Updated on Tue, Jan 2 2024 12:58 PM

Japan Earthquake Updates In Telugu - Sakshi

జపాన్‌లో భారీ  భూకంపం అప్‌డేట్స్‌:

► జపాన్‌లో సునామి హెచ్చరికలు, సలహాలను అధికారులు ఎత్తివేశారు. అయితే సముద్రపు అలల్లో మార్పులు రావడానికి ఇంకా అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు భూకంప బాధితుల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.


► జపాన్‌లో భీభత్సం సృష్టించిన భూకంపంలో 30 మంది మృత్యువాత పడ్డారని స్థానిక అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే ఈ మృతు సంఖ్య ఇంకా పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మృతి చెందిన 30 మందిలో సగం మంది వాజిమా నగరంలో చనిపోయినట్టు తెలుస్తోంది. 

► సముద్రపు అలలు 5 అడుగులపైకి దూసుకురావటంతో అధికారులు సునామి హెచ్చరికలు జారీ చేశారు. భూకంపంతో సమారు 33 వేల ఇళ్లకు విద్యుత్‌ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. 

 జపాన్‌లో సంభవించిన భారీ భూకంపం కారణంగా మృతుల సంఖ్య పెరుగొచ్చని, ఇప్పటి వరకు 20 మంది మృత్యువాత పడ్డారని జపాన్‌ స్థానిక మీడియా వెల్లడించింది.

జపాన్‌లో సంభవించిన భారీ భూకంపంలో సహాయ చర్యలపై ప్రధానమంత్రి పుమియో కిషిడా సమీక్ష నిర్వహించారు. ‘భూకంపంతో తీవ్రమైన నష్టం జరిగింది. ఆస్తి, ప్రాణ నష్టం చోటు చేసుంది. పలు చోట్ల భవనాలు కూలిపోయాయి. భూకంపంతో కొన్ని చోట్ల అగ్ని ప్రమాదం జరిగింది’ అని తెలిపారు. భూకంపంతో ఇబ్బందులు పడుతున్న వారికి  సహయక చర్యలు కొనసాగిస్తున్నామని తెలిపారు. పలు కూలీపోయిన భవనాల శిథిలాల్లో చిక్కుకున్నవారిని బయటకు తీసుకురావడానకి రెస్య్కూ టీం సాయం అందిస్తోందని పేర్కొన్నారు. 

జపాన్‌ భారీ భూకంపంతో సోమవారం నుంచి 155 సార్లు  భూమి కంపించింది. భారీ భూకంపంతో పలు  భవనాలు కూలిపోయాయి. పలు రోడ్లపై పగుళ్లు వచ్చాయి. భూకంప తీవ్రతకు తెలిపే CCTV ఫుటేజీ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వీడియోల్లో రోడ్ల పగుళ్లు, రైల్వే స్టేషన్‌లో బోర్డులు ఊగిపోవటం కనిపిస్తున్నాయి.

 భారీ భూకంపం జపాన్‌ను కుదిపేసింది. సోమవారం రిక్కార్‌ స్కేల్‌పై 7.6 తీవ్రతో భూకంపం నమోదైనట్లు జపాన్‌ వాతారణ  సంస్థ పేర్కొంది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఇళ్లు నేలకూలాయి. మరికొన్ని ఇళ్లకు పగుళ్లు కనిపించాయి. అయితే ఇప్పటివరకు ఎనిది మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. 

అదేవిధంగా జపాన్‌లో చోటుచేసుకున్న భూకంపం కారణంగా ఇషికావా నగరంలో భారీగా మంటలు చెలరేగాయి. పలు భవనాలు మంటల్లో కాలిపోయాయి. 30,000 కంటే ఎక్కువ గృహాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

ఇషిగావా రాష్ట్రంలో సముద్ర తీర ప్రాంతాల్లో వరుసగా భూప్రకంపనలు సంభవించాయి. ఇషిగావాలోని నోటో ప్రాంతం నుంచి 300 కిలోమీటర్ల మేర సునామీ అలలు విస్తరించే అవకాశం ఉందని స్థానిక వాతావరణ సంస్థలు అంచనా వేశాయి. భూకంపం వల్ల ఇళ్లు కంపిస్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో దర్శనమిచ్చాయి. భూప్రకంపనలతో భయాందోళనకు గురైన జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కొందరు కుర్చీలు, టేబుళ్ల కింద దాక్కున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement