
బెర్న్: జపాన్‌లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈసారైనా టోక్యో ఒలింపిక్స్ జరుగుతాయో లేదో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, గేమ్స్ నిర్వాహకులు స్పష్టత ఇవ్వాలని స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం ఫెడరర్ కోరాడు.
ఒకవేళ ఒలింపిక్స్ రద్దయితే ఎందుకు రద్దు చేశారో తాను అర్ధం చేసుకోగలనని 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో డబుల్స్ స్వర్ణం, 2012 లండన్ ఒలింపిక్స్‌లో సింగిల్స్‌లో రజతం నెగ్గిన ఫెడరర్ అన్నాడు. ఒకవేళ ఒలింపిక్స్ జరిగితే తాను బరిలోకి దిగుతానని ఫెడరర్ తెలిపాడు.