ప్రపంచంలో అత్యంత భధ్రత కలిగిన నగరాల జాబితాలో టోక్యో మొదటి స్థానంలో నిలించింది. ఎకనామిక్ ఇంటలిజెన్స్ యూనిట్ వెల్లడించిన ఈ జాబితాలో టోక్యో నగరమే వరుసగా మూడోసారి నంబర్ వన్‌గా నిలిచింది. ఈ జాబితాలో భారత్ నుంచి ముంబై 45, ఢిల్లీ 52వ స్థానాన్ని సంపాదించాయి. మొత్తం 5 ఖండాలలోని 60 నగరాలను గుర్తించిన ఈ జాబితాను డిజిటల్ విధానం, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, వ్యక్తిగత భద్రత వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని రూపొందించారు. కాగా అందరిని ఆశ్చర్యపరుస్తూ వాషింగ్టన్, డీసీ, నగరాలు మొదటి 10 స్థానాల్లో ఆధిపత్యం వహిస్తున్నాయి. హాంకాంగ్ 9వ స్థానం నుంచి 20వ స్థానానికి పడిపోగా.. సింగపూర్, ఒసాకా వాటి స్థానాలను కాపాడాకుంటూ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment