Safe City
-
హైదరాబాద్ అత్యంత సేఫ్: సీపీ అంజనీకుమార్
సాక్షి, హైదరాబాద్: దేశంలో అత్యంత సేఫ్ సిటీల్లో హైదరాబాద్ నంబర్-2లో ఉందని సీపీ అంజనీకుమార్ అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రపంచంలో అత్యంత సురక్షిత నగరాల్లో హైదరాబాద్ ఒకటని అమెరికాకు చెందిన సర్వే కంపెనీ కూడా చెప్పిందని ఆయన గుర్తు చేశారు. నేరస్తులను గుర్తించడంలో సీపీ కెమెరాలు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. హైదరాబాద్‌లో 6 లక్షల సీసీ కెమెరాలున్నాయని.. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని సీపీ పేర్కొన్నారు. రాత్రి సమయాల్లో కూడా రికార్డు అయ్యేలా టెక్నాలజీని వాడుతున్నామన్నారు. ఎన్నో నేరాలను ఛేదించడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు. కోర్టుల్లో ఆధారాలుగానూ ఉపయోగపడుతున్నాయన్నారు. సీసీ కెమెరాలు ఉండటంతో 2018 నుంచి బహిరంగ ప్రదేశాల్లో నేరాల శాతం తగ్గుతూ వస్తోందని సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. చదవండి: ట్యాంక్‌బండ్‌పై చూస్తుండగానే కాలిపోయిన కారు లాక్డౌన్ పెట్టం: సీఎం కేసీఆర్ -
హైదరాబాద్.. సేఫ్ సిటీ
మన నగరం సురక్షితమైనదే. తీవ్ర భూకంపాలకు ఇక్కడ అవకాశాలు తక్కువే. బోరబండలో శుక్రవారం రాత్రి సంభవించింది అతి సూక్ష్మ ప్రకంపనలే. ఇది రిక్టర్ స్కేలుపై 1.5 మ్యాగ్నట్యూడ్ మాత్రమే రికార్డు అయ్యింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గతంలోనూ ఇక్కడ సూక్ష్మ భూ ప్రకంపనలు వచ్చాయి. ఇక్కడి ప్రకంపనలపై అధ్యయనం చేస్తున్నాం. కొన్నిచోట్ల సెస్మోగ్రాఫ్(భూకంప లేఖిని) యంత్రాలు ఏర్పాటు చేస్తున్నాం. – ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు ఉప్పల్/జూబ్లీహిల్స్/వెంగళరావునగర్: నగరంలోని బోరబండలో శుక్రవారం రాత్రి వచ్చిన భూ ప్రకంపనలు చాలా సూక్ష్మమైనవే. రిక్టర్ స్కేలుపై 1.5 మ్యాగ్నట్యూడ్ మాత్రమే రికార్డు అయ్యిందని సీఎస్ఐఆర్–ఎన్జీఆర్ఐ చీఫ్ సైంటిస్టు డాక్టర్ శ్రీనగేష్ స్పష్టం చేశారు. ఎక్కడైతే భూ పొరల్లో పగుళ్లు, రాళ్లు ఒత్తిడులకు గురవుతాయో అక్కడే భూకంపాలు, ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందన్నారు. భూమి పొరల్లోని కిలోమీటరు నుంచి రెండు కిలో మీటర్ల లోతులో ప్రకంపనలు ఏర్పడితే మనకు శబ్ధాలు వినిపిస్తాయని, శబ్ధాలు వచ్చినప్పుడల్లా భయాందోళనకు గురికావడం సహజమేనన్నారు. అయితే ఎవ్వరూ దిగులు చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇంకా ఆయన ఏం చెప్పారంటే... బోరబండలో భూ ప్రకంపనలు కొత్తేమీ కాదు. 2017లోనూ ఇదే తరహాలో ప్రకంపనలు వచ్చాయి. ఆ సమయంలో ఇక్కడ యంత్రాలు అమర్చి అధ్యయనం చేశాం. ఒకటి రెండు కిలోమీటర్ల లోపలే ప్రకంపనలు ఏర్పడ్డాయని గుర్తించాం. – శుక్రవారం రాత్రి బోరబండలో భూమి లోపలి పలకల మధ్య వచ్చిన ఒత్తిడిలు, రాళ్లలో పగుళ్ల కారణంగా ప్రకంపనలు జరిగి ఇలాంటి శబ్ధాలు వినిపించాయి. 1995–96లో కూడా జూబ్లీహిల్స్‌లో ఇలాంటి ప్రకంపనలే వచ్చాయి. గత 55 ఏళ్లుగా హైదరాబాద్ ఉప్పల్‌లోని ఎన్జీఆర్ఐ భూకంప క్షేత్రంలో ఏర్పాటు చేసిన యంత్రాలలో నమోదైన రికార్డులను అధ్యయనం చేయగా పెద్దగా చెప్పుకోదగ్గ భూకంపాలు నమోదు కాలేదు. మేడ్చల్‌లో మాత్రం 1985లో అత్యధికంగా రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదు అయ్యింది. 2017 నుంచి ఇప్పటి వరకు బోరబండలోనే దాదాపుగా 135 సార్లు ప్రకంపనలు వచ్చాయి. అవి కేవలం 0.5, 0.2 మధ్యలోనే వచ్చాయి. బోరబండలోనే భూప్రకంపనలు రావడానికి గల కారణాలను విశ్లేషిస్తే..ఇక్కడ భూమి పొరల్లో వత్తిడి ఎక్కువగా ఉంది. అందుకే ప్రకంపనలు వస్తున్నాయి. వీటితో ఎలాంటి ప్రమాదం లేదు. ఈ వర్షాకాలంలో అత్యధిక వర్షపాతం నమోదైనందున భూ పొరల్లో కూడా ఒత్తిడి, సర్దుబాట్లు వచ్చి ఇలాంటి ప్రకంపనలు వస్తున్నాయి. సేఫ్ భూకంపాలు అంటే.. సేఫ్ భూకంపాలు అంటే అతి సూక్ష్మ తీవ్రత గల ప్రకంపనలుగా గుర్తిస్తాం. ఈ ప్రకంపనల వల్ల ఆస్తినష్టం కానీ, ప్రాణ నష్టం కానీ జరగదు. కేవలం హిమాలయాల్లాంటి పర్యత శ్రేణుల్లో మాత్రమే పెద్ద పెద్ద భూకంపాలు నమోదవుతాయి. బోరబండలో కానీ హైదరాబాద్‌లో కానీ నిర్మాణాలకు ఎలాంటి ఇబ్బందులు లేదు. కానీ భూకంపాలను తట్టుకునే విధంగా నిర్మాణాలు సాగడం మరింత సురక్షితం. మాట్లాడుతున్న ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు, డిప్యూటీ మేయర్ బోరబండలో సెస్మోగ్రాఫ్ల ఏర్పాటు బోరబండలో శనివారం నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ)కు చెందిన శాస్త్రవ్తేత్తల బృందం పర్యటించింది. బోరబండ ఎన్‌ఆర్‌ఆర్‌పురం సైట్–3లోని సాయిబాబానగర్, ఎన్‌ఆర్‌ఆర్‌పురం సైట్–4, సైట్–5లలోని జయవంత్‌నగర్, వెంకటేశ్వరకాలనీ, అంబేద్కర్‌నగర్, అన్నానగర్, పెద్దమ్మనగర్, ప్రభుత్వ నాట్కో ఉన్నత పాఠశాల పరిసర ప్రాంతాలతో పాటు చుట్టు పక్కన ఉన్న బస్తీల్లో పర్యటించి ప్రజలను కలుసుకున్నారు. వారి నుంచి వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు శేఖర్, నరేష్, సురేష్‌లు మాట్లాడుతూ ప్రజలు భయపడాల్సిన పనిలేదని, ఇక్కడ వచ్చింది సూక్ష్మ ప్రకంపనలేనని పేర్కొన్నారు. భూమి లోపల శబ్దాలు రావడానికి గల కారణాలు తెలుసుకోవడానికి పరిశోధన సాగుతుందన్నారు. ఈ మేరకు నాట్కో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సాయిబాబానగర్ కమ్యూనిటీహాల్, ఎన్‌ఆర్‌ఆర్‌పురం సైట్–4,5లకు చెందిన కమ్యూనిటీహాల్లో మొత్తం మూడు సెస్మోగ్రాఫ్ (భూకంపలేఖిని) పరికరాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 24 గంటల్లో పూర్తి సమాచారం తెలుస్తుందని పేర్కొన్నారు. శాస్త్రవేత్తల పర్యటనలో డిప్యూటీమేయర్ బాబాఫసియుద్దీన్, ఖైరతాబాద్ తహశీల్దారు హసీనాబేగం, ఉప కమిషనర్ ఏ.రమేష్ ఉన్నారు. -
మరోసారి టోక్యోనే నంబర్ వన్
ప్రపంచంలో అత్యంత భధ్రత కలిగిన నగరాల జాబితాలో టోక్యో మొదటి స్థానంలో నిలించింది. ఎకనామిక్ ఇంటలిజెన్స్ యూనిట్ వెల్లడించిన ఈ జాబితాలో టోక్యో నగరమే వరుసగా మూడోసారి నంబర్ వన్‌గా నిలిచింది. ఈ జాబితాలో భారత్ నుంచి ముంబై 45, ఢిల్లీ 52వ స్థానాన్ని సంపాదించాయి. మొత్తం 5 ఖండాలలోని 60 నగరాలను గుర్తించిన ఈ జాబితాను డిజిటల్ విధానం, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, వ్యక్తిగత భద్రత వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని రూపొందించారు. కాగా అందరిని ఆశ్చర్యపరుస్తూ వాషింగ్టన్, డీసీ, నగరాలు మొదటి 10 స్థానాల్లో ఆధిపత్యం వహిస్తున్నాయి. హాంకాంగ్ 9వ స్థానం నుంచి 20వ స్థానానికి పడిపోగా.. సింగపూర్, ఒసాకా వాటి స్థానాలను కాపాడాకుంటూ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. -
సేఫ్‌లో టోక్యో టాప్
న్యూఢిల్లీ: ప్రపంచంలోని సురక్షితమైన నగరాలు–2019 జాబితాలో ఆసియా–పసిఫిక్ ప్రాంతం ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. టాప్–10లో ఆరు ర్యాంకులను ఈ ప్రాంతంలోని నగరాలే చేజిక్కించుకున్నాయి. జపాన్ రాజధాని టోక్యో తన మొదటి స్థానాన్ని మూడోసారీ పదిలం చేసుకోగా.. సింగపూర్, ఒసాకాలు సైతం తమ పూర్వపు ర్యాంకులను దక్కించుకున్నాయి. అయితే ఈసారి అగ్రరాజ్యం అమెరికా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ.. తొలిసారి టాప్–10లోకి దూసుకొచ్చింది. 2017లో 23 స్థానంతో సరిపెట్టుకున్న అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ ఈసారి 7వ ర్యాంకును సాధించుకుంది. ముంబై 45వ స్థానంలో.. ఢిల్లీ 52వ స్థానంలో నిలిచాయి. ప్రపంచంలోని సురక్షితమైన నగరాల జాబితా–2019కి సంబంధించిన నివేదికను ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ గురువారం విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా 5 ఖండాలకు చెందిన నగరాల్లోని పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని టాప్–60 సిటీలతో ఈ నివేదికను ప్రచురించింది. దీనిలో భాగంగా ఆయా నగరాల్లోని సైబర్ భద్రత, వైద్య సదుపాయాలు, వ్యక్తిగత భద్రత, మౌలిక వసతులు వంటి అంశాల మేరకు ర్యాంకులను ప్రకటించింది. దీని ప్రకారం.. నిరసనకారుల ఆందోళనలతో అట్టుడికిపోతున్న హంకాంగ్ 2017లోని తన 9వ ర్యాంకుని కోల్పోయి.. 20వ స్థానానికి పడిపోయింది. ఇక ఆసియా–పసిఫిక్ ప్రాంతం డిజిటల్ సెక్యూరిటీలో చాలా మెరుగవ్వాల్సి ఉందని చెప్పారు. ఆసియా నుంచి ఢాకా(బంగ్లాదేశ్), కరాచీ(పాకిస్తాన్), యంగూన్(మయన్మార్)లు వరుసగా 56, 57, 58 ర్యాంకుల్లో ఉన్నాయి. -
మహిళా సురక్షిత నగరాలకు 2,900 కోట్లు
న్యూఢిల్లీ: నగరాలను మహిళలకు సురక్షితంగా మార్చేందుకు కేంద్రం రూ.2,900 కోట్లు కేటాయించింది. ఇందుకోసం ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, లక్నోలను ఎంపిక చేసింది. మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. నిర్భయ నిధుల్లో నుంచి ఖర్చు చేయనున్న మొత్తం రూ.2,919.55 కోట్లలో ఢిల్లీకి రూ.663.67 కోట్లు, ముంబైకి రూ.252 కోట్లు, బెంగళూరుకు రూ.667 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో వీడియో పర్యవేక్షణ,ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటు, వీడియో ఫీడ్ షేరింగ్ ఉన్న పెట్రోలింగ్ వ్యాన్లను, మహిళా పోలీస్ స్టేషన్లను ఏర్పాటుచేస్తారు. -
మొక్కలు నాటి.. మరచిపోవద్దు
ఎంపీ కవిత గచ్చిబౌలి: మొక్కలు నాటి... మరచిపోవద్దని... ఆరు నెలలు వాటిని కాపాడితే.. ఆ తరువాత అవి మనల్ని కాపాడతాయని ఎంపీ కవిత అన్నారు. సమాజంలోని కలుపు మొక్కలను ఏరివేసే షీ టీమ్స్ మొక్కలు నాటడం శుభ పరిణామమని ప్రశంసించారు. శుక్రవారం గచ్చిబౌలి హౌసింగ్ బోర్డు ఖాళీ స్థలంలో సైబరాబాద్ షీ టీమ్స్ ఆధ్వర్యంలో ‘మహిళ హరితహారం’ కార్యక్రమం చేపట్టారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎంపీ కవిత మాట్లాడుతూ పోలీసులు ప్రజలతో మమేకమై అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని తెలిపారు. ప్రతి మహిళ హైదరాబాద్‌ను సేఫ్ సిటీగా భావిస్తోందన్నారు. నగరంలో పచ్చదనం, ఆహ్లాదం పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రవుంలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, సైబరాబాద్ ఈస్ట్ కమిషనర్ మహేశ్ భగవత్, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ చైర్మన్ భరణి, మాదాపూర్ డీసీపీ కార్తికేయ, సాంఘిక సంక్షేమ బోర్డు చైర్పర్సన్ రాగం సుజాత, కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, షేక్ హమీద్ పటేల్, అడిషనల్ డీసీపీ సలీమ, ఏసీపీ రమణకుమార్, సీఐలు సునీత, జూపల్లి రమేశ్, నర్సింగరావు, దుర్గాప్రసాద్, వెస్ట్ జోన్ లెసైన్స్ ఆఫీసర్ రవికుమార్, ఉప వైధ్యాధికారి రవికుమార్, నందుసింద్, తదితరులు పాల్గొన్నారు. -
హైటెక్ పోలీసింగ్
నేర నియంత్రణలో జపాన్ టెక్నాలజీ పెరిగిన వాట్పప్, ఫేస్బుక్ ఫిర్యాదులు కీలక సర్కిళ్లలో 200 సీసీ కెమెరాలు అన్ని రోడ్లల్లోనూ 24 గంటలూ నిఘా పోలీస్ యూట్యూబ్‌కు ఆదరణ సేఫ్ సిటీ లక్ష్యానికి చేరువలో తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంగా భాసిల్లుతోన్న తిరుపతి నగరాన్ని సురక్షిత నగరం (సేఫ్ సిటీ)గా మార్చేందుకు పోలీస్ యంత్రాంగం విస్తృతంగా కృషిచేస్తోంది. 2018 నాటికి నేర రహిత నగరంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం జపాన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటోంది. హైటెక్ పోలీసింగ్ వ్యవస్థను నగరంలో పటిష్ట పర్చడమే కాకుండా నగరవాసులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి నిత్యం వచ్చే వేలాదిమంది యాత్రికులకు పూర్తిస్థాయి భరోసా కల్పించేందుకు కసరత్తు చేస్తోంది. రాష్ట్ర డీజీపీ నుంచి కూడా మంచి ప్రోత్సాహం లభిస్తుండటంతో అత్యాధునిక నేర నియంత్రణ పరికరాలను దిగుమతి చేసుకోవడం, వాటి ద్వారా నిఘా వ్యవస్థను బలోపేతం చేయడం చేపట్టింది. తిరుపతి: తిరుపతి నగర వాసులతో స్నేహ సంబంధాలను మెరుగుపర్చుకోవడంతో పాటు నేరాల నియంత్రణలో ప్రజల సహకారాన్ని పూర్తిస్థాయిలో పొందేందుకు అర్బన్ పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. తిరుపతి అర్బన్ పరిధిలో అలిపిరి, ఈస్ట్, వెస్ట్, ఎంఆర్ పల్లి సర్కిళ్లు ఉన్నాయి. ప్రపంచస్థాయిలో పేరున్న పుణ్యక్షేత్రమే కాకుండా యాత్రా స్థలం కావడంతో నిత్యం దేశ విదేశాల నుంచి వేలాది మంది యాత్రికులు రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో నేరగాళ్ల కదలికలు కూడా ఎక్కువే. ఎర్రచందనం స్మగ్లింగ్ నుంచి చిల్లర దొంగతనాల వరకూ అన్ని రకాల నేరాలు ఇక్కడ సుపరిచితమే. ఇటీవల కాలంలో ఎర్రచందనం కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో తిరుపతి అర్బన్ పరిధిలో పోలీస్, విజిలెన్స్, టాస్క్ఫోర్సు విభాగాలను ఉన్నతాధికారులు పటిష్టం చేశారు. రాకపోకలు సాగించే వీఐపీలకు బందోబస్తు కల్పించడం నుంచి ఇతరత్రా ప్రొటోకాల్ డ్యూటీలు ఎక్కువ కావడంతో శాంతిభద్రతల పరిరక్షణ అంశం ఒక సందర్భంలో అర్బన్ పోలీసులకు సవాల్‌గా మారింది. దీంతో వీరు అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుని నేరాల నియంత్రణకు శ్రీకారం చుట్టారు. ఈ విధానం వల్ల కొంత మెరుగైన ఫలితాలు కనిపిస్తుండటంతో టెక్నాలజీని మరింత అప్డేట్ చేసుకుని అన్ని రకాల నేరాలను నియంత్రించాలని నిర్ణయం తీసుకున్నారు. నగరంలో 200 సీసీ కెమెరాలు అర్బన్ ఎస్పీగా గోపీనాథ్‌జెట్టి ఉన్నపుడే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. టౌన్‌క్లబ్, బాలాజీ కాలనీ, అన్నమయ్యసర్కిల్, లీలామహల్ సర్కిల్ వంటి రద్దీ ప్రదేశాల్లో అత్యాధునిక సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు. ఇందులో ఐపీ కెమెరాలు, పీటీ రోటేట్ కెమెరాలు కూడా ఉన్నాయి. వీటివల్ల నగరంలోని ప్రధాన రోడ్ల గుండా రాకపోకలు సాగించే వివిధ జిల్లాల వాహనాలు, వాటిల్లోని వ్యక్తులను గుర్తించే వీలుంది. హైఫ్రీక్వెన్సీ లెన్సులు ఉన్న వీటి సాయంతో అనుమానాస్పద వ్యక్తులను గుర్తించడమే కాకుండా వాహనాల రాకపోకలు సక్రమంగా ఉన్నాయో లేదో ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ నుంచి గమనిస్తుండవచ్చు. దీంతో నిఘా వ్యవస్థ పటిష్ట పడింది. ఇవి మాత్రమే కాకుండా పోలీస్ యూట్యూబ్‌ను అందుబాటులోకి తేవడం వల్ల వీక్షకుల సంఖ్య పెరిగి క్షణాల్లో సమాచారం పోలీసులకు చేరిపోతుంది. ఇవి మాత్రమే కాకుండా ఫేస్బుక్, వాట్సప్ గ్రూప్‌ల వల్ల కూడా నేరాల నియంత్రణలో ఫలితాలు కనిపిస్తున్నాయి. ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర రెడ్‌లైట్ వయోలేషన్, సిగ్నల్ జంప్, ఓవర్‌స్పీడ్ వంటి కేసులు ఎదురైనపుడు వెంటనే వారిని గుర్తించడం తేలికవుతోంది. జపాన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఏర్పాటు చేసిన సేఫ్ సిటీ బృందాల పనితీరు బాగుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. టెక్నాలజీ వాడకం వల్ల.... నేరాల నియంత్రణ కోసం పోలీసులు అమల్లోకి తెచ్చిన ఆధునిక టెక్నాలజీ వల్ల అన్ని రకాల నేరాలను తేలికగా గుర్తించడం వీలవుతోంది. 2015 జనవరి 24 నుంచి ఇప్పటివరకూ 26,779 మంది వాహనచోదకులకు ఈ-చలాన్లు జారీచేసి వారి నుంచి పెనాల్టీలు వసూలు చేయడం జరిగింది. అదేవిధంగా నోపార్కింగ్, ఇతరత్రా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన కేసులు 1,191 నమోదయ్యాయి. చోరీలు, దోపిడీలు వంటి నేరాలు 250, మరో 826 శాంతి భద్రతల కేసులు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో నేరాల సంఖ్యను పూర్తిగా తగ్గించడమే కాకుండా 2018 నాటికి సేఫ్ సిటీగా తిరుపతిని తీర్చిదిద్దాలన్నది పోలీసుల లక్ష్యంగా కనిపిస్తోంది. ఇటీవల నగరంలో రాజు అనే వ్యక్తి పోలీసులు లేరని భావించి సెల్ఫోన్లో మాట్లాడుతూ వా హనం నడుపుతూ సీసీ కెమెరాలకు చిక్కాడు. దీంతో సీసీ కెమెరాల పర్యవేక్షణాధికారి వాహనం నంబర్ సాయంతో చిరునామా గుర్తించి జరిమానా విధించారు. ఆర్సీ రోడ్‌లోని రైల్వే గేట్ సమీపంలో ఓ వాహనం మరమ్మతుల కారణంగా నడిరోడ్డులో నిలిచిపోయింది. దీన్ని గమనించిన నగర వాసు లు ఫోటోలు తీసి పోలీస్ వాట్సప్‌కు పంపారు. సకాలంలో ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆగిపోయిన వాహనాన్ని తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. -
ఏకైక లక్ష్యం.. సేఫ్ సిటీ :నాయిని నర్సింహారెడ్డి
అందరి భద్రత.. మా బాధ్యతే త్వరలో మరిన్ని కొత్త పోలీస్ స్టేషన్లు పదివేల సీసీ కెమెరాలు ఏర్పాటు సాక్షి ఇంటర్వ్యూలో హోంమంత్రి నాయిని వెల్లడి సాక్షి, సిటీబ్యూరో: ‘హైదరాబాద్ మహానగరాన్ని సేఫ్ సిటీగా మార్చటమే మా ఏకైక లక్ష్యం. నగరంలో స్థిరపడ్డ వారందరికీ భద్రత కల్పించటం మా కర్తవ్యం. ఆ దిశగా అవసరమైన మేర పోలీస్ వ్యవస్థను పటిష్టపర్చటం, పోలీస్ కానిస్టేబుల్ మొదలుకుని కమిషనర్ వరకు జవాబుదారీతనంతో వ్యవహరించే దిశగా మా ప్రభుత్వం పనిచేస్తుంది’ అని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం ఆయన సాక్షి ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక అంశాలు వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ప్రజాభద్రతే మా ధ్యేయం నగర జనాభా రోజురోజుకూ పెరుగుతోంది. ప్రపంచ దేశాలతో పాటు దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఈ మహానగరంలో జీవిస్తున్నారు. అందరికీ భద్రత కల్పిస్తూ నేర నివారణ, నేర పరిశోధనకు ప్రాధాన్యతనిస్తాం. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే వారి విషయంలో పోలీసులు ప్రవర్తించే తీరులో మార్పు తీసుకువస్తాం. పోలీస్స్టేషన్లు బలహీనులకు ఓ అండనివ్వాలి. అందుకే కొత్త పోలీస్స్టేషన్ల ఏర్పాటు, సిబ్బంది నియామకాలను చేపడతాం. మారుతున్న నేరాలకు అనుగుణంగా పోలీస్ యంత్రాంగానికి అవసరమైన శిక్షణ ఇస్తాం. లండన్ తరహాలో మెగాసిటీ పోలీస్ పథకం కింద హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో సుమారు పదివేల సీసీ కెమెరాల ఏర్పాటు చేస్తాం. సీసీ కెమెరాల ఏర్పాటుతో లండన్‌లో నేరాల శాతం గణనీయంగా తగ్గిపోయింది. పోలీస్స్టేషన్ల నిర్వహణ వ్యయం పెంచటంతో పాటు అవసరమైన వాహనాలు సమకూర్చాలని నిర్ణయించాం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను మరింత ఊపుతో ముందుకు తీసుకువెళ్లే దిశగా పోలీస్ యంత్రాంగం తప్పక కృషి చేస్తుంది. సర్వమత సమ్మేళనంగా సిటీని తీర్చిదిద్దుతాం హైదరాబాద్ సర్వమత సమ్మేళనం. అన్ని మతాలు మాకు సమానమే. ముఖ్యంగా హిందూ ముస్లింలు గతంలో మాదిరిగా అన్ని పండుగలు కలిసి చేసుకునే సంస్కృతి (గంగాజమున తైజీబ్)ని ముందుకు తెస్తాం. పండుగలు, సామాజిక ఉత్సవాలకు ప్రభుత్వమే అవసరమైన ఏర్పాట్లు చేస్తుంది. తెలంగాణ ఏర్పాటైన అనంతరం పలువురు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి 2001 నుంచి టీఆర్ఎస్ ఉద్యమం చేసినా నగరంలో ఏ ఒక్కరినీ ఇబ్బంది పెట్టలేదు. ఎవరి వ్యాపారాలనూ అడ్డుకోలేదు. ఉద్యమ హోరులోనూ హైదరాబాద్ ముందుకు వెళ్లగలిగింది. మున్ముందూ ఇదే పంథా కొనసాగుతుంది. విద్య, ఉపాధి, వ్యాపారాల కోసం వచ్చేవారికి మా ప్రభుత్వం రెడ్‌కార్పెట్ పరుస్తుంది. నగారాభివృద్ధికి నిపుణుల కమిటీ ఏర్పాటు నగరంలో ఇప్పటికే వివిధ స్వచ్చంద సంస్థలు పలు అంశాలపై పనిచేస్తున్నాయి. అయితే ఆయా రంగాల్లో హైదరాబాద్‌ను మరింత ముందుకు వెళ్లే దిశగా తరచూ ఆయా రంగాల ఎక్స్‌పర్ట్స్‌తో సమావేశ మవ్వాలని భావిస్తున్నాం. ఇందు కోసం ఓ కమిటీ ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలో మేధావుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని భావిస్తున్నాం.