మహిళా సురక్షిత నగరాలకు 2,900 కోట్లు | Centre Approves Rs 2900 Crore to Make Cities Safer for Women | Sakshi
Sakshi News home page

మహిళా సురక్షిత నగరాలకు 2,900 కోట్లు

Published Fri, Mar 2 2018 2:58 AM | Last Updated on Fri, Mar 2 2018 2:58 AM

Centre Approves Rs 2900 Crore to Make Cities Safer for Women - Sakshi

న్యూఢిల్లీ: నగరాలను మహిళలకు సురక్షితంగా మార్చేందుకు కేంద్రం రూ.2,900 కోట్లు కేటాయించింది. ఇందుకోసం ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, లక్నోలను ఎంపిక చేసింది. మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. నిర్భయ నిధుల్లో నుంచి ఖర్చు చేయనున్న మొత్తం రూ.2,919.55 కోట్లలో ఢిల్లీకి రూ.663.67 కోట్లు, ముంబైకి రూ.252 కోట్లు, బెంగళూరుకు రూ.667 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో వీడియో పర్యవేక్షణ,ట్రాకింగ్‌ వ్యవస్థ ఏర్పాటు, వీడియో ఫీడ్‌ షేరింగ్‌ ఉన్న పెట్రోలింగ్‌ వ్యాన్‌లను, మహిళా పోలీస్‌ స్టేషన్లను ఏర్పాటుచేస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement