టోక్యో: టెన్నిస్ కోర్టుల్లో ప్రత్యర్థులతో పోటీపడే ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ రొటీన్‌కు భిన్నంగా రెజ్లింగ్ బౌట్‌లోకి దిగాడు. టోక్యో ఓపెన్ ఆడేందుకు జపాన్ వచ్చిన ఈ సెర్బియన్ దిగ్గజం సరదాగా సుమో వీరులతో కుస్తీ పట్టాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సెర్బియన్ స్టార్ అభిమానుల్ని విశేషంగా అలరిస్తున్నాయి. తన తొలి రౌండ్ మ్యాచ్‌కు తీరిక దొరకడంతో కాసేపు ఇద్దరు సుమో వీరులతో సై అంటే సై అన్నాడు. అనంతరం ఈ బక్కపలుచని టెన్నిస్ యోధుడు మాట్లాడుతూ సుమోల కంటే కాస్త బరువు తక్కువున్నానని చమత్కరించాడు.
‘నేను ఇంకొన్ని కిలోల బరువు పెరిగితే వీళ్లతో పోటీకి సిద్ధపడొచ్చు’ అని చెప్పుకొచ్చాడు. భారీకాయులైన సుమోలు ఎంత సరళంగా, ఎంత చురుగ్గా తమ చేతులు, కాళ్లు ఆడిస్తారోచూస్తుంటే చాలా ముచ్చటేస్తుందని అన్నాడు. పర్యాటకులే కాదు... విదేశీ దిగ్గజాలు సుమోలను కలవడం జపాన్‌లో పరిపాటి. ఇక టోక్యో ఓపెన్ టోర్నీలో జొకోవిచ్ మొదటిసారి డబుల్స్ మ్యాచ్ ఆడటం విశేషం. సహచర సెర్బియన్ ఫిలిప్ క్రాజినొవిచ్‌తో కలిసి బరిలోకి దిగిన జొకోవిచ్ 2–6, 6–4, 4–10తో మ్యాట్ పావిక్ (క్రొయేషియా)–బ్రూనో సొరెస్ (బ్రెజిల్) జంట చేతిలో ఓడిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment