Sumo Wrestlers
-
ముంబై: మన గడ్డపై జపాన్ సుమోల సందడి (ఫొటోలు)
-
పాపం ప్రత్యర్ధి చేతిలో తనువు చాలించిన సుమో రెజ్లర్
టోక్యో : ప్రత్యర్థి చేతిలో గాయపడి ఓ యువ సుమో రెజ్లర్ తనువు చాలించాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నెలరోజుల తర్వాత మృత్యువాతపడ్డాడు. ఈ సంఘటన జపాన్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. భారీకాయంతో ప్రేక్షకుల్ని అలరించే పురాతన క్రీడ అయిన సుమో రెజ్లింగ్‌లో ఇప్పుడిప్పుడే రాణిస్తోన్న హిబికిర్యూ (28) మార్చి 26న చివరి గ్రాండ్ టోర్నమెంట్లో పాల్గొన్నాడు. ఈ మ్యాచ్ జరిగే సమయంలో ప్రత్యర్ధి రెజ్లర్ హిబికిర్యూని బౌట్లో మట్టికరిపించే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో ప్రత్యర్ధి హిబికిర్యూని కిందపడేయడంతో తల బలంగా నేలకు తాకింది. దీంతో అస్వస్థతకు గురైన అతడు అక్కడికక్కడే కుప్పకూలి పోయాడు. వాస్తవానికి గేమ్‌లో నిబంధనల మేర బౌట్లో కిందపడిన రెజ్లర్ పైకి లేసే సాంప్రదాయం ఉంది. అలాగే బౌట్లో నేలకొరిగిన హిబికిర్యూ కూడా లేస్తారని అందరూ అనుకున్నారు. కానీ, ఎంతకీ పైకి లెగవలేకపోవడంతో అనుమానం వ్యక్తం చేసిన మ్యాచ్ ప్రతినిధులు అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సుమారు నెలరోజుల పాటు ట్రీట్మ్ంట్ తీసుకున్న రెజ్లర్ హిబికిర్యూ శ్వాసకోశ సంబంధిత సమస్యలతో మరణించినట్లు జపాన్ సుమో అసోసియేషన్ ప్రకటించింది. -
బాల బాహుబలి ఇక లేడు
మాస్కో: పిన్న వయసులో అధిక బరువుతో గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కి బాల బహుబలిగా పేరు పొందిన ధాంబులత్ ఖటోఖోవ్ మృతి చెందాడు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న ఈ రష్యా యువ సుమో రెజ్లర్ గత మంగళవారం కన్నుమూశాడు. ఈ విషయాన్ని సుమో రెజ్లింగ్ గవర్నింగ్ బాడీకి చెందిన బెటల్ గుబ్జెవ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం 21 ఏళ్ల వయసున్న ఖటోఖోవ్ మరణానికి సంబంధించిన కారణాలను గుబ్జెవ్ వెలువరించలేదు. రెండేండ్ల వయసులో ఖటోఖోవ్ ఏకంగా 34 కిలోల బరువుతో గిన్నిస్ ప్రపంచ రికార్డుల్లో తన పేరును లిఖించుకున్నాడు. కాగా 7 ఏళ్ల వయసులో 100 కేజీల బరువు పెరిగిన ఖటోఖోవ్ 'బేబి ఎలిఫెంట్' అనే ట్యాగ్‌ను సంపాదించాడు. చిన్న వయసులోనే బాల బాహుబలిగా పేరు పొందిన ఇతను 13 ఏళ్ల వయసులో 180 కిలోల బరువు పెరిగి తన రికార్డును తానే బద్దలు కొట్టాడు. -
కరోనాతో ‘సుమో’ రెజ్లర్ మృతి
టోక్యో: కరోనా మహమ్మారి కారణంగా జపాన్ యువ సుమో రెజ్లర్ తనువు చాలించాడు. భారీకాయం తో ప్రేక్షకుల్ని అలరించే పురాతన క్రీడ అయిన సుమో రెజ్లింగ్‌లో ఇప్పుడిప్పుడే రాణిస్తోన్న 28 ఏళ్ల షోబుషి... నెలరోజుల పాటు కరోనాతో పోరాడి బుధవారం కన్నుమూశాడు. టోక్యోలోని ‘టకడగవా సుమో స్టేబుల్’కు చెందిన షోబుషి వైరస్ దాడి కారణంగా శరీరంలోని అవయవాలు పనిచేయడం మానేయడంతో మృత్యువాత పడ్డాడు. ఏప్రిల్ నాలుగు నుంచి జ్వరం, దగ్గులాంటి కరోనా లక్షణాలతో బాధపడిన షోబుషి... చివరి వరకు ఆ వ్యాధిని జయించడానికి తీవ్రంగా పోరాడాడని సుమో సంఘం చీఫ్ హక్కకు తెలిపాడు. జపాన్‌లో పెద్ద సంఖ్యలో సుమో రెజ్లర్లు, మాస్టర్లు కరోనా బారిన పడినట్లు ఆయన చెప్పాడు. ఈ కారణంతోనే ఈ నెల జరగాల్సిన ‘బాషో’ టోర్నీలను రద్దు చేసినట్లు పేర్కొన్నాడు. 2011లో ఫిక్సింగ్ ఉదంతం తర్వాత టోర్నీలు రద్దు కావడం ఇదే మొదటిసారని అన్నాడు. -
సుమోలతో జొకో ‘ఫైటింగ్’
టోక్యో: టెన్నిస్ కోర్టుల్లో ప్రత్యర్థులతో పోటీపడే ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ రొటీన్‌కు భిన్నంగా రెజ్లింగ్ బౌట్‌లోకి దిగాడు. టోక్యో ఓపెన్ ఆడేందుకు జపాన్ వచ్చిన ఈ సెర్బియన్ దిగ్గజం సరదాగా సుమో వీరులతో కుస్తీ పట్టాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సెర్బియన్ స్టార్ అభిమానుల్ని విశేషంగా అలరిస్తున్నాయి. తన తొలి రౌండ్ మ్యాచ్‌కు తీరిక దొరకడంతో కాసేపు ఇద్దరు సుమో వీరులతో సై అంటే సై అన్నాడు. అనంతరం ఈ బక్కపలుచని టెన్నిస్ యోధుడు మాట్లాడుతూ సుమోల కంటే కాస్త బరువు తక్కువున్నానని చమత్కరించాడు. ‘నేను ఇంకొన్ని కిలోల బరువు పెరిగితే వీళ్లతో పోటీకి సిద్ధపడొచ్చు’ అని చెప్పుకొచ్చాడు. భారీకాయులైన సుమోలు ఎంత సరళంగా, ఎంత చురుగ్గా తమ చేతులు, కాళ్లు ఆడిస్తారోచూస్తుంటే చాలా ముచ్చటేస్తుందని అన్నాడు. పర్యాటకులే కాదు... విదేశీ దిగ్గజాలు సుమోలను కలవడం జపాన్‌లో పరిపాటి. ఇక టోక్యో ఓపెన్ టోర్నీలో జొకోవిచ్ మొదటిసారి డబుల్స్ మ్యాచ్ ఆడటం విశేషం. సహచర సెర్బియన్ ఫిలిప్ క్రాజినొవిచ్తో కలిసి బరిలోకి దిగిన జొకోవిచ్ 2–6, 6–4, 4–10తో మ్యాట్ పావిక్ (క్రొయేషియా)–బ్రూనో సొరెస్ (బ్రెజిల్) జంట చేతిలో ఓడిపోయాడు. -
‘బేబీ క్రై సుమో’