క్వార్టర్స్‌కు సింధు, ప్రణీత్‌ | Sindhu And Praneeth Enters Japan Open Quarters | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌కు సింధు, ప్రణీత్‌

Published Thu, Jul 25 2019 12:21 PM | Last Updated on Thu, Jul 25 2019 12:27 PM

Sindhu And Praneeth Enters Japan Open Quarters - Sakshi

టోక్యో:  జపాన్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-750 టోర్నమెంట్‌లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు క్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సింధు 11-21, 21-10, 21-13 తేడాతో ఆయూ ఒహోరి(జపాన్‌)పై గెలిచి క్వార్టర్స్‌కు చేరారు. తొలి గేమ్‌ను కోల్పోయిన సింధు.. ఆపై రెండో గేమ్‌ లో సత్తాచాటారు. ఇక మ్యాచ్‌ నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సైతం సింధు విజృంభించి ఆడారు.

ఏ దశలోనూ ఒహోరికి అవకాశం ఇవ్వని సింధు గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా సొంతం చేసుకున్నారు. ఇక పురుషుల సింగిల్స్‌ సాయి ప్రణీత్‌ క్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. సాయి ప్రణీత్‌ 21-13, 21-16 తేడాతో కాంటా సునెయామ(జపాన్‌)పై గెలిచి క్వార్టర్స్‌ బెర్తును ఖాయం చేసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement