మళ్లీ యామగుచి చేతిలోనే.. | Sindhus Campaign Ends With Quarter Final Loss to Yamaguchi | Sakshi
Sakshi News home page

మళ్లీ యామగుచి చేతిలోనే..

Published Fri, Jul 26 2019 1:14 PM | Last Updated on Fri, Jul 26 2019 1:24 PM

Sindhus Campaign Ends With Quarter Final Loss to Yamaguchi - Sakshi

టోక్యో: జపార్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌-750 టోర్నమెంట్‌ నుంచి భారత షట్లర్‌ పీవీ సింధు నిష్క్రమించారు. మహిళల సింగిల్స్‌లో భాగంగా శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో పీవీ సింధు 18-21, 15-21 తేడాతో యామగూచి(జపాన్‌) చేతిలో పరాజయం చెందారు. దాంతో జపాన్‌ ఓపెన్‌లో పీవీ సింధు కథ క్వార్టర్‌ ఫైనల్లోనే ముగిసింది. ఇటీవల ఇండోనేసియా ఓపెన్‌ తుది పోరులో యామగుచిని కట్టడి చేయడంలో విఫలమైన పీవీ సింధు.. మరోసారి అదే క్రీడాకారిణి చేతిలో ఓటమి చెందారు. (ఇక్కడ చదవండి: సాయి ప్రణీత్‌ కొత్త చరిత్ర)

తొలి గేమ్‌ ఆరంభంలో సింధు ఆధిక్యంలో నిలిచినప్పటికీ ఆపై ఒత్తిడికి లోనై వరుసగా పాయింట్లు కోల్పోయారు. దాంతో గేమ్‌ను కోల్పోయి వెనుకబడ్డారు. ఇక రెండో గేమ్‌లో యామగుచి విజృంభించి ఆడారు. రెండో గేమ్‌లో ఇరువురు క్రీడాకారిణులు 4-4తో సమంగా ఉన్న సమయంలో పైచేయి సాధించిన యామగుచి అదే ఊపును కడవరకూ కొనసాగించారు. దాంతో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుని సెమీస్‌ బెర్తును ఖాయం చేసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement