టోక్యో : జీ 20 సమావేశాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం జపాన్ ప్రధాని షింజో అబేతో భేటీ అయ్యారు. ఇరువురు నేతలు ప్రపంచ వాణిజ్యం, వాతావరణ మార్పులు సహా ద్వైపాక్షిక అంశాలపైనా చర్చించారు. ఇండో-జపాన్ సంబంధాలపైనా విస్తృతంగా సంప్రదింపులు జరిపారు. ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైల్ ప్రాజెక్టుతో పాటు వారణాసిలో నిర్మించే కన్వెన్షన్ సెంటర్‌పైనా వారిరువురూ చర్చించారని అధికారులు వెల్లడించారు.
సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయని పీఎంఓ ట్వీట్ చేసింది. మరోవైపు భారత్, అమెరికా, జపాన్ దేశాధినేతల త్రైపాక్షిక చర్చల సందర్భంగా ఇరువురు నేతలు శుక్రవారం మరోసారి సమావేశం కానున్నారు. కాగా అంతకుముందు జీ 20 సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఉదయం జపాన్ చేరుకున్నారు.
జీ 20 భేటీ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ సహా పలు దేశాధినేతలతో సంప్రదింపులు జరపనున్నారు. అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన పలు అంశాలతో పాటు భారత్ దృక్కోణాన్ని ఈ చర్చల సందర్భంగా అంతర్జాతీయ నేతల ముందు ప్రధాని మోదీ వెల్లడిస్తారని పీఎంఓ ట్వీట్ పేర్కొంది
Comments
Please login to add a commentAdd a comment