టోక్యో: ఏడాది కాలంగా అద్వితీయమైన ఫామ్‌లో ఉన్న జపాన్ బ్యాడ్మింటన్ స్టార్ కెంటో మొమోటా ఈ సీజన్‌లో ఆరో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. సొంతగడ్డపై ఆదివారం ముగిసిన జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్ మొమోటా టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్, ప్రపంచ చాంపియన్ అయిన కెంటో మొమోటా 21–16, 21–13తో ఆరో సీడ్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)పై అలవోకగా గెలుపొందాడు.
44 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్ లో మొమోటాకు ఏ దశలోనూ క్రిస్టీ పోటీనివ్వలేకపోయాడు. విజేత మొమోటాకు 52,500 డాలర్ల (రూ. 36 లక్షల 15 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 11,000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ ఏడాది తొమ్మిది టోర్నీల్లో పాల్గొన్న మొమోటా ఆరు టోర్నీల్లో చాంపియన్‌గా నిలిచాడు. జపాన్ ఓపెన్, ఆసియా చాంపియన్‌షిప్, సింగపూర్ ఓపెన్, ఆల్ ఇంగ్లండ్ ఓపెన్, జర్మన్ ఓపెన్, ఇండోనేసియా మాస్టర్స్ టోర్నీల్లో మొమోటా టైటిల్స్ సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment