టోక్యో : జపాన్ దేశ తూర్పుతీర ప్రాంతం మియాగీలో సోమవారం తెల్లవారుజామున 5:30 నిమిషాలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.1గా నమోదైందని అధికారులు ప్రకటించారు. 50 కిలోమీటర్ల లోతు వరకు భూమి కంపించింనట్లు జియోలాజికల్ సర్వే తెలిపింది. అయితే భూ ప్రకంపనల తర్వాత సునామీ హెచ్చరికలు రాలేదని స్పష్టం చేశారు. ప్రాణనష్టం, ఆస్తినష్టం కూడా తక్కువే అని పేర్కొన్నారు. అయితే గతంలో 2011లో మియాగి ప్రాంతంలో 9.0 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా సునామి ఏర్పడి భారీ నష్టాన్ని మిగిల్చింది. దీని వల్ల దాదాపు 16,000 మంది ప్రాణాలు కోల్పోయారు.
Comments
Please login to add a commentAdd a comment