వాషింగ్టన్: అంతరిక్షంలో అంతుచిక్కని సునామీని నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికి సంబంధించిన వీడియా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సునామీలు బ్లాక్‌హోల్స్ వల్ల సంభవిస్తున్నాయని నాసాకు చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కంప్యూటర్ స్టిమ్యులేషన్ ఆధారంగా ఈ సునామీలను గుర్తించినట్లు వారు వెల్లడించారు. బ్లాక్‌హోల్స్ గురుత్వాకర్షణ నుంచి వాయువులు తప్పించుకోవడం, రేడియేషన్ వల్ల భారీ స్థాయిలో సునామీ ఏర్పడుతుందని తేల్చారు. ఇది దాదాపు పది కాంతి సంవత్సరాల వరకూ విస్తరించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అంతరిక్షంలో చాలా బ్లాక్‌హోల్స్ ఇలాంటి సునామీలను సృష్టిస్తున్నాయని పరిశోధకులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment