
ప్రతీకాత్మక చిత్రం
టోక్యో: జపాన్‌లో సోమవారం వేకువజామున 1.32 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై దీని తీవ్రత 6.1గా నమోదైంది. జపాన్ మెటియోరాలాజికల్ ఏజెన్సీ(జేఎంఏ) ప్రకారం..భూకంపకేంద్రం 35.2 డిగ్రీల ఉత్తర అక్షాంశాలు, 132.6 డిగ్రీలు తూర్పు రేఖాంశాల మధ్య 10 కి.మీల లోతున ఓడా పట్టణంలో సంభవించింది.
ఈ ఘటనతో పట్టణంలో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. అలాగే నీటి సరఫరా సమస్య కూడా తలెత్తింది. ఈ భూకంపం వల్ల పట్టణంలో పలు భవనాలకు, రోడ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. కానీ న్యూక్లియర్ పవర్ స్టేషన్లకు ఎటువంటి ప్రమాదం కలగలేదు..యథావిధిగా పనిచేస్తున్నాయి. ఎటువంటి సునామీ హెచ్చరికలు కూడా అధికారులు జారీ చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment