
ఇండోనేషియాలో భూకంపం
జకార్తా: ఇండోనేషియాలో బుధవారం ఉదయం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రెక్టర్ స్కేలుపై 5.7 పాయింట్లుగా నమోదైనట్లు వాతావరణ, భూభౌతిక సంస్థ వెల్లడించింది. మలుకు టెగ్గారా బరాత్ ప్రాంతానికి ఈశాన్యంగా 86 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపారు.
భూకంపాలు సంభవించడానికి ఎక్కువగా అవకాశం ఉన్న ‘పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్’ప్రాంతంలో ఉన్న ఇండోనేషియాను భూకంపాలు తరచుగా వణికిస్తున్నాయి. ఇవాళ్టి భూకంపం సముద్రం అడుగున 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు జిన్హువా తెలిపింది. సునామీ ప్రమాదమేమీ లేదని అధికారులు వెల్లడించారు. ఎలాంటి ఆస్థి, ప్రాణనష్టం నమోదైనట్లు సమాచారం లేదు.